
అగ్ర దర్శకుడు రాజమౌళి (SS Rajamouli) ఓ వీడియో గేమ్‌లో ప్రత్యక్షమయ్యారు. ఈ వీడియో గేమ్కు సంబంధించిన విజువల్స్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వీడియో గేమ్ల రూపకల్పనకు జపాన్ పెట్టింది పేరు. అక్కడ రూపొందిన వీడియో గేమ్లు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. వీడియో గేమ్‌లు ఇష్టపడే ప్రతిఒక్కరికీ జపాన్కు చెందిన ప్రముఖుడు హిడియో కోజిమా (Hideo Kojima) సుపరిచితమే. ఆయన రూపొందించిన సూపర్ సక్సెస్ గేమ్ డెత్ స్ట్రాండింగ్. దీనికి కొనసాగింపుగా తీస్తున్న డెత్ స్ట్రాండింగ్ 2లో (Death Stranding 2) రాజమౌళి, ఆయన కొడుకు కార్తికేయ కనిపించనునారు.
రాజమౌళిది వినోదాత్మక అతిథి పాత్ర
డెత్ స్ట్రాండింగ్ 2లో ప్రముఖ హాలీవుడ్ నటులు నార్మన్ రీడస్, ఎల్లీ ఫానింగ్‌లు భాగమయ్యారు. వారితో పాటు జక్కన్న, కార్తికేయ కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. జూన్ 26 నుంచి ప్లేస్టేషన్‌లో ఈ వీడియో గేమ్ పూర్తిగా అందుబాటులో ఉండనుంది. అయితే రాజమౌళిది వినోదాత్మక అతిథి పాత్ర అని వీడియోలు చూస్తే అర్థమవుతోంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా జపాన్‌లో భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అప్పుడే కోజిమాను రాజమౌళి కలిశారు. కొన్ని ఫొటోలు కూడా షేర్ చేశారు. అప్పుడే ఈ సిరీస్కు బీజం పడినట్లు తెలుస్తోంది.
#DeathStranding2 video game featuring SSR! 👍
— idlebrain jeevi (@idlebrainjeevi) June 24, 2025
ఎస్‌ఎస్‌ఎంబీ29తో బిజీ బిజీ..
ప్రస్తుతం రాజమౌళి.. మహేశ్ బాబు ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఇప్పటికే పలు షెడ్యూళ్లు పూర్తి చేసుకుంది. తదుపరి షెడ్యూల్‌లో భాగంగా నీటిలో ఓ భారీ బోట్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్‌లో మహేశ్, ప్రియాంక, పృథ్వీరాజ్‌తో పాటు దాదాపు 3వేల మంది జూనియర్ ఆర్టిస్ట్‌లు పాల్గొననున్నారని.. దీనికోసం వీళ్లంతా ప్రత్యేకంగా సన్నద్ధం అవనున్నారని తెలుస్తోంది.