ఐపీఎల్ 2025లో వరుస ఓటములతో కుదేలవుతున్న చెన్నై సూపర్ కింగ్స్(CSK) మరో పోరుకు సిద్ధమైంది. ఈ మేరకు చెన్నైలోని చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)తో తలపడుతోంది. ఈ మ్యాచులో టాస్ నెగ్గిన కేకేఆర్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కాగా చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమవడంతో ఆ జట్టు పగ్గాలు మళ్లీ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni)కే అప్పగించింది. కష్ట సమయంలో కెప్టెన్సీ అందుకున్న ధోనీ సూపర్ కింగ్స్‌కు విజయాలు అందిస్తాడని ఆ జట్టు ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ రెండు టీమ్స్ మధ్య మొత్తం 30 మ్యాచ్ లు జరగగా.. CSK 19 గెలిచింది. KKR 10 గెలిచింది. ఒకటి ఫలితం తేలలేదు. కాగా CSK రెండు మార్పులతో బరిలోకి దిగగా.. KKR ఒక మార్పుతో ఆడుతోంది.
Toss Update from Chepauk: @KKRiders win the toss and choose to bowl first against @ChennaiIPL! Big clash loading under the Chennai lights! 🔥💛💜#CSKvKKR #TATAIPL
— Anil (@anil_AK143) April 11, 2025
తుది జట్లు ఇవే..
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, శివమ్ దూబే, MS ధోనీ(Wk/C), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డికాక్(Wk), సునీల్ నరైన్, అజింక్యా రహానే(C), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, మొయిన్ అలీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చకరవర్తి
PLAYING XI OF CSK & KKR.
– DHONI IS BACK IS CAPTAIN.💛#CSKvsKKR #KKRvsCSK #CSKvKKR #MSDhoni #MSDhoni𓃵 #AjinkyaRahane #AnshulKamboj #RuturajGaikwad pic.twitter.com/JTszsZXran
— Harsh (@Harshsuthar119) April 11, 2025






