ఐపీఎల్ 2025లో సొంతగడ్డపై చెన్నై సూపర్ కింగ్స్(CSK) చిత్తయింది. శుక్రవారం చిన్నస్వామి స్టేడియంలో CSKతో జరిగిన మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. కాగా సొంతగడ్డపై CSK ఇంత చెత్త పర్ఫార్మెన్స్ చూస్తామని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఆ జట్టు ఫ్యాన్స్‌కు ధోనీ(MS Dhoni) కెప్టెన్‌గా తిరిగి బరిలోకి దిగాడన్న సంతోషం కాసేపు కూడా లేకుండా పోయింది.
బ్యాటర్లు విలవిలా..
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన CSK 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 103 పరుగులకే పరిమితమైంది. క్రీజులోకి వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లే పెవిలియన్ చేరారు. ఆ టీమ్‌లో శివమ్ దూబే (31*), విజయ్ శంకర్ (29) చేసిన పరుగులే హయ్యెస్ట్. CSK బ్యాటర్లలో రచిన్ (4), కాన్వే (12), త్రిపాఠి (16), విజయ్ శంకర్ (29), శివమ్ అశ్విన్ (1), జడేజా (0), దీపక్ హూడా (0), ధోనీ (1), నూర్ అహ్మద్ (1) రన్స్ చేశారు. KKR స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి 3, సునీల్ నరైన్ (3 వికెట్లు) దెబ్బకు CSK బ్యాటర్లు విలవిలలాడిపోయారు. రాణా 2, అరోరా, మోయిన్ అలీ చెరోవికెట్ తీశారు.
ధోనీ ఔట్‌పై వివాదం
చెన్నై బ్యాటింగ్‌లో 7 వికెట్ల పడ్డ తర్వాత వచ్చిన ధోనీ.. సునీల్ నరైన్ బౌలింగ్‌లో LBW అయ్యి.. వెనుదిరిగాడు. ఐతే.. వెంటనే రివ్యూ తీసుకున్నాడు. రివ్యూలో ధోని బ్యాట్‌కు బాల్ ఎడ్జ్ అయినట్టు కనిపించింది. కానీ అంపైర్ ఔటిచ్చాడు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశచెందారు. సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. ధోనీ ఔటవ్వకపోయినా.. ఔట్ ఇచ్చారంటూ మండిపడుతున్నారు.
😂CSK batters to their bats: ‘We don’t need you today!’ 🏏
Ultra-Edge agrees—no edge, just OUT! 3rd umpire says, ‘Sorry, absolutely no bat involved!’ 😂 #CSKvsKKR #IPL2025 #KKRvsCSK pic.twitter.com/2NB66lWtbp
— CRICKET 18 LOVER (@Cricket_18_love) April 11, 2025
10.1 ఓవర్లలోనే 104 ఉఫ్..
అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన కేకేఆర్ బ్యాటర్లు కేవలం 10.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించేసింది. డికాక్ (16 బంతుల్లో 23), సునీల్ నరైన్ (18 బంతుల్లో 44) విహారంతో 4 ఓవర్లకే 46 రన్స్ చేసింది. ఈ క్రమంలో డికాక్ ఔటయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రహానే 17 సునీల్ నరైన్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. జట్టు స్కోరు 85 పరుగుల వద్ద నరైన్ ఔటైనా.. రింకూ సింగ్ (15)తో రహానే లాంఛనాన్ని పూర్తి చేశాడు. సీఎస్కే బౌలర్లలో కాంబోజ్, అహ్మద్ చెరో వికెట్ చేశారు. ఆలౌరౌండ్ ప్రదర్శనతో చెలరేగిన సునీల్ నరైన్‌కి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
Clinical with the ball, fiery with the bat 🫡 🔥
A superb all-round performance earns Sunil Narine the Player of the Match award 🔝#CSKvsKKR #TATAIPL #IPL2025 #IPLonJioStar #IPL18 #WhistlePodu @KKRiders @CSKFansOfficial pic.twitter.com/2kMqXqjhzi
— Nishu Gautam (@NishuGautam10) April 11, 2025






