విరాట్ కోహ్లీ(Virat Kohli).. క్రీడా ప్రపంచంలో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అద్భుత ఆటతీరుతో టీమ్ఇండియా(Team India)కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. ఒక్కప్పుడు సచిన్ క్రియేట్ చేసిన రికార్డులను ఒక్కొక్కటిగా బద్ధలు కొడుతూ ఆశ్చర్యానికి గురిచేశాడు. ముఖ్యంగా ఛేజింగ్ అంటేనే విరాట్‌కు పూనకం వస్తుంది. దాదాపు 15 సంవత్సరాల పాటు టీమ్ ఇండియాలో కొనసాగాడు. అయితే భారత్ టీ20 ప్రపంచ కప్(T20 WC) నెగ్గిన తర్వాత ఆ ఫార్మాట్‌కు వీడ్కోలు చెప్పిన కింగ్.. ఇటీవల సుధీర్ఘ ఫార్మాట్(Tests)కూ రిటైర్మెంట్ ప్రకటించాడు.
పరుగుల రారాజు
ఈ పరుగుల రారాజు ప్రస్తుతం కేవలం వన్డే మ్యాచ్‌లలో మాత్రమే కింగ్ ఆడనున్నాడు. అటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఓవరాల్‌గా విరాట్ కోహ్లీ కెరీర్ దాదాపు ముగిసింది అనే చెప్పవచ్చు. ఇలాంటి నేపథ్యంలో.. విరాట్ కోహ్లీ బయోపిక్(Biopic) తీసేందుకు కొంతమంది దర్శకులు(Directors) ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా కోహ్లీ 123 టెస్టుల్లో 9230, 125 టీ20ల్లో 4188, 302 వన్డేల్లో 14,181 రన్స్ చేశాడు. IPLలో ఆర్సీబీ తరఫున 263 మ్యాచుల్లో 8509 రన్స్ సాధించాడు.

విరాట్ కోహ్లీ అంటే నాకు చాలా ఇష్టం: శింబు
ఈ గ్యాప్ లోనే విరాట్ కోహ్లీ కటౌట్‌కు సూట్ అయ్యే హీరోలను కూడా వెతుకుతున్నారట. ఈ న్యూస్ బయటకు రావడంతో… తమిళ్ హీరో శింబు(Kollywood Star Simbu) పేరు తెర పైకి వచ్చింది. విరాట్ కోహ్లీ బయోపిక్‌లో తాను నటిస్తానని ఇప్పటికే శింబు ప్రకటించాడు. విరాట్ కోహ్లీ అంటే తనకు చాలా ఇష్టమని, అలాంటి ప్లేయర్ బయోపిక్‌లో నటిస్తే తనకు గర్వంగా ఉంటుందని గతంలో శింబు వెల్లడించాడు. తాజాగా ఇదే విషయం తన వద్దకు రావడంతో ఇదే.. అభిప్రాయాన్ని మరోసారి వ్యక్తం చేసినట్లు సోషల్ మీడియా(SM)లో వార్తలు వస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
/indian-express-tamil/media/media_files/2025/05/01/AIB3kqPf3TrxIb0tkX8B.jpg)






