మహేశ్ బాబు-ఎస్ఎస్ రాజమౌళి(Mahesh Babu-SS Rajamouli) కాంబోలో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న మూవీ SSMB 29. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అడ్వెంచర్ థ్రిల్లర్(Adventure thriller) నేపథ్యంలో రూపొందుతోన్న ఈ మూవీలో ఇప్పటికే పలువురు టాలీవుడ్, బాలీవుడ్ స్టార్లు నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో స్టార్ హీరోను భారీ ప్రాజెక్టులోకి తీసుకొచ్చేందుకు దర్శకుడు జక్కన్న ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ న్యూస్ సెన్సేషన్‌గా మారింది.
విలన్ పాత్రలు ఇప్పుడే చేయాలనుకోవట్లేదట..
సినీవర్గాల మేరకు కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్(Kollywood Star Vikram)కు జక్కన్న మూవీలోని ఓ కీలక పాత్ర కోసం ఆఫర్ వెళ్లిందని సమాచారం. అయితే విక్రమ్ దానికి ఒప్పుకోలేదట. తాను విలన్ పాత్రల(Villain Characters)ను ఇప్పుడే చేయాలనుకోవడం లేదనే నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇదే రోల్‌ను ప్రస్తుతం పృథ్వీరాజ్(Prithviraj) లేదా ఆర్ మాధవన్ చేయనున్నారన్నది తాజా టాక్. కాగా బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్(Nana Patekar) కూడా ఇదే చిత్రాన్ని రిజెక్ట్ చేశారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. దీంతో రాజమౌళి స్టైలిష్ విలన్ కోసం ఇంకా అన్వేషణ కొనసాగుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
2026 చివరల్లో లేదా 2027లో రిలీజ్
ఇక మహేశ్ బాబు పాత్ర విషయానికి వస్తే ఇది ఆయన కెరీర్‌లోనే ఇది భిన్నమైన లుక్. ఛాలెంజింగ్ గెటప్‌తో రూపుదిద్దుకుంటోందట. ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి(MM Keeravani) మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్(Durga Arts Banner)పై KL నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలోతెరకెక్కుతోంది. 2026 చివరల్లో లేదా 2027లో రిలీజ్ చేసే అవకాశం ఉంది.
SSMB29: Did R Madhavan replace Chiyaan Vikram? Shaitaan actor to play dark character!#SSMB29 #SSRajamouli #MaheshBabu #PriyankaChopra #PrithvirajSukumaran #RMadhavan #ChiyaanVikram #Tollywood #TeluguFilmIndustry #Shaitaan #Bollywoodhttps://t.co/0A3SEaTobA
— NITESH KUMAR (@KumarNikstwiter) June 9, 2025






