ManaEnadu:తెలంగాణలో మొత్తం మంత్రి కొండా సురేఖ(KONDA SUREKHA) పేరే మారుమోగుతోంది. ఆమెను సినీ ఇండస్ట్రీ లెఫ్టూరైటూ ఇచ్చుకుంటోంది. కాంగ్రెస్‌లోనూ ఒక్కరిద్దరు మినహా ఎవరూ ఆమెకు సపోర్టుగా నిల్చునేందుకు ముందుకు రావడం లేదు. అధిష్ఠానం అయితే ఏకంగా ఆమెను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసేందుకు యోచిస్తోందనే వార్తలూ వస్తున్నాయి. కాంగ్రెస్‌లో మునుపెన్నడూ లేనంతా వ్యతిరేకత మొదలైనట్లు కనిపిస్తోంది. ఒకవేళ కోర్టు కనికరించకుంటే ఆమె జైలుకు వెళ్లే ఛాన్సూ లేకపోలేదు. ఇంతకీ అసలు సురేఖ ఎందుకు రేఖ దాటారు? అందుకు దారి తీసిన పరిస్థితులేంటి? అసలు ఈ గొడవ ఎలా మొదలైంది? రండి ఓ లుక్కేద్దాం.
రఘునందన్‌రావుతో మొదలు..
ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ మంత్రి సురేఖ, బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు(RAGHUNANDAN RAO) కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునందనరావు ఆమె మెడలో నూలు దండ వేశారు. వేర్వేరు పార్టీల నేతలు వేదికను పంచుకుంటే మూడో పార్టీ దాన్ని ఆయుధంగా మలుచుకొని ట్రోల్స్ చేయడం ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. బీఆర్ఎస్ సపోర్టర్లు కూడా అదే చేసింది. సురేఖకు రఘునందన్ దండ వేస్తున్నప్పుడు తీసిన ఫొటోకు ‘షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ’ అని సెటైరికల్‌గా క్యాప్షన్ పెట్టి సోషల్ మీడియాలో ట్రెండ్ చేసింది. ఇది సురేఖను బాగా హార్ట్ చేసింది. ఈ విషయంలో మీడియా ముందుకు వచ్చిన సురేఖ ట్విటర్ పేజీలో తనపై జరుగుతున్న ట్రోలింగ్ స్క్రీన్‌షాట్ తీసుకొచ్చి బోరున ఏడ్చేసింది. తనకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ విషయంలో రఘునందన్ రావు సైతం ‘ఇది నా వల్లే మొదలైంది. చింతిస్తున్నాను’ అని స్పందించారు.
కేటీఆర్‌పై అటాక్..
మూసీ పరివాహక ప్రాంతాల నిర్వాసితులను పరామర్శించేందుకు వెళుతున్న కేటీఆర్‌ను(KTR) హైదరాబాద్‌లో కొండా సురేఖ అనుచరులు అడ్డుకొని, ఆయన వాహనంపై దాడి చేశారు. అయినా కేటీఆర్ స్పందించలేదు. దీంతో ఈసారి ఏకంగా మీడియా ముందుకు వచ్చిన సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. ‘కేటీఆర్ వల్లే సమంత(SAMANTHA) విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ఎన్.కన్వెన్షన్ కూల్చకుండా ఉండాలంటే సమంతను నా దగ్గరికి పంపాలన్నారు. నాగార్జున(NAGARJUNA) కూడా సమంతను కేటీఆర్ దగ్గరికి వెళ్లమన్నారు. అయితే సమంత అందుకు ఒప్పుకోలేదు. ఈక్రమంలోనే సమంత విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. సమంత ఒక్కరే కాదు. టాలీవుడ్‌లో చాలామంది హీరోయిన్లు ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవడానికి కేటీఆరే కారణం. ఆయన డ్రగ్స్ తీసుకొని, వాళ్లకు అలవాటు చేశాడు. రేవ్ పార్టీలకు వెళ్లాడు. బ్లాక్ మెయిల్ చేసి వాళ్లను వేధించాడు’ అని మంత్రి సురేఖ తీవ్రంగా ఆరోపించారు. ఈ విషయంలో కేటీఆర్ సురేఖకు పరువునష్టం దావా వేస్తానంటూ నోటీసులు పంపించారు. ఇదిలా ఉండగా మరోవైపు సురేఖ కామెంట్స్‌తో టాలీవుడ్‌తో సినీ ఇండస్ట్రీ భగ్గుమంది. సురేఖపై దుమ్మెత్తిపోసింది.
అక్కినేని ఫ్యామిలీ ఫైర్..
నాగార్జున, సమంత, చైతన్య, అమల, అఖిల్ తీవ్రంగా స్పందించారు. అమల అయితే ఓ అడుగు ముందుకేసి ఏకంగా రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేసింది. నాగార్జున నాంపల్లి కోర్టులో డిఫమేషన్ కేసు వేశారు. సోమవారం విచారణ జరగనుంది. అటు ఇదే విషయంలో నటి రకుల్ ప్రీత్ సింగ్ సైతం స్పందించారు. రాజకీయ స్వార్థం కోసం తన పేరును కూడా వాడుకోవద్దని వార్నింగ్ ఇచ్చారు. కేవలం ఇండస్ట్రీ వాళ్లే కాదు.. జర్నలిస్టులు సైతం సురేఖకు చివాట్లు పెట్టారు. మంత్రిగా బాధ్యతగల పదవిలో ఉండి నోటికొచ్చినట్లు ఎలా మాట్లాడుతారని నిలదీశారు. ఈ విషయంలో ఎట్టకేలకు దిగొచ్చిన మంత్రి నేరుగా క్షమాపణలు చెప్పకుండా కేవలం సమంతను ట్యాగ్ చేస్తూ మనసు నొచ్చుకొని ఉంటే మాటలు వెనక్కి తీసుకుంటున్నా అని ట్వీటారు.
సురేఖది ముమ్మాటికీ తప్పే..
మంత్రి కొండా సురేఖ తనపై ట్రోలింగ్ వచ్చిందని ఆవేదన చెందడంలో తప్పు లేదు. కానీ, సినిమా హీరోయిన్లను ఇందులోకి లాగి విమర్శించడం తీవ్ర ఆక్షేపణీయం. పబ్లిక్ లైఫ్‌లో ఉన్నప్పుడు విమర్శలు, ట్రోలింగ్(TROLLING) కామన్. వ్యక్తిగత విమర్శలు వచ్చినా హుందాగా ఉండాలి. సంయమనం పాటించాలి. పైగా అధికారంలో ఉన్నారామె. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ ట్రోలింగ్ చేసిన పోకిరీలను పట్టుకుని తగిన జైలుకు పంపొచ్చు. ఫలితంగా ఇంకొకరు ఇలాంటి అసభ్యకర పనులు చేయడానికి భయపడతారు. కానీ ఒక మహిళా మంత్రిగా ఉండి సురేఖ చేసింది నూటికి నూరు శాతం తప్పే.






