‘కేరాఫ్ కంచరపాలెం’ లాంటి ఫీల్‌గుడ్ మూవీ నిర్మించి అందులో వేశ్య పాత్ర పోషించి మెప్పించారు ప్రవీణ పరుచూరి (Praveena Paruchuri). ఆ తర్వాత ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ లాంటి హిట్ సినిమా నిర్మించారు. ఇప్పుడు ఆమె మెగా ఫోన్ అందుకొని దర్శకత్వం వహించారు. ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ (Kothapallilo Okappudu) అనే పేరుతో సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. ఈ మూవీకి రానా (Rana Daggubati) నిర్మాతగా వ్యవహరిస్తుండడం మరో విశేషం. ఈ సినిమా జులై 18న ఇది విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని ట్రైలర్‌ను మూవీ టీమ్ విడుదల చేసింది. రవీంద్ర విజయ్, మనోజ్ చంద్ర, బొంగ సత్తి తదితరులు ప్రధాన పాత్రలు నటించారు. సస్పెన్స్ థ్రిల్లర్‌కు కామెడీ జోడించి పొందించారు. ఆసక్తికరంగా ఉన్న ట్రైలర్‌ను మీరూ చూసేయండి.






