
ఫార్ములా ఈ-రేస్(Formula E Race) వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని నెలలుగా గత BRS ప్రభుత్వం, తనపై అనేక ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంలో మాజీ మంత్రి KTRపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తెలంగాణ(Telangana) రాష్ట్రానికి, హైదరాబాద్(Hyderabad) నగరానికి మంచి జరగాలనే ఉద్దేశంతోనే గత ప్రభుత్వం ఫార్ములా ఈ-రేస్ నిర్వహించినట్లు స్పష్టం చేశారు. 2023లో ఈ రేస్ విజయవంతంగా జరిగి అన్నివర్గాల వారి మన్ననలను అందుకుందని కేటీఆర్ అన్నారు.
ప్రభుత్వం ప్రచారం చేస్తోంది: KTR
ఈ రేస్ వల్ల రాష్ట్రానికి రూ.700 కోట్లు లబ్ధి చేకూరిందని నీల్సన్ సంస్థ నివేదిక(Nielsen Institute report) స్పష్టం చేసినట్లు ఆయన తెలిపారు. కేవలం తమపై రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ ప్రభుత్వం తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. నిజానికి ఫార్ములా రేస్ ఒప్పందం అంతా పారదర్శకంగా జరిగిందన్నారు. రేస్ నిర్వాహకులకు చెల్లింపులు కూడా అంతా జన్యూన్‌గానే జరిగాయని KTR తేల్చి చెప్పారు. ఆయన CM రేవంత్ సర్కార్ తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. రేవంత్ నిజంగా మగాడే అయితే అసెంబ్లీలో ఫార్ములా ఈ రేస్‌పై అసెంబ్లీలో చర్చ పెట్టాలని సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రజలకు నిజాలేమిటో తెలుసుకునే హక్కుందని అన్నారు. అందుకోసం శాసనసభలో ఈ అంశంపై చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు CM రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు.
నిధుల దుర్వినియోగంపై కేసు
కాగా గతేడాది నిర్వహించిన ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ(ANTI-CORRUPTION BUREAU) కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. కేటీఆర్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 13(1)A, 13(2) PC యాక్ట్ కింద కేసులు నమోదు అయ్యాయి. మరో రెండు కేసులు BNS 409, 120B సెక్షన్లను చేర్చారు. నాలుగు సెక్షన్లు నాన్‌బెయిలబుల్ కేసులే పెట్టిన ACB అధికారులు, A-1గా KTR, A-2గా అప్పటి మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి IAS అధికారి అరవింద్ కుమార్, A-3గా HMDA చీఫ్ ఇంజినీర్ BLN రెడ్డి పేర్లను చేర్చారు.
I challenge CM Revanth Reddy to hold a discussion in the ongoing Telangana Legislative Assembly session on the Formula E Race (Hyderabad E-Prix)
Why discuss this matter for 1 and half hours in Cabinet Meeting and plant silly media leaks?
Instead of discussing within confines… pic.twitter.com/QE5IRHhrKk
— KTR (@KTRBRS) December 18, 2024