బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) చుట్టూ ఈ ఫార్ములా రేస్ ఉచ్చు బిగిస్తోంది. హైదరాబాద్‌లో చేపట్టిన ఈ ఫార్ములా రేసింగ్‌లో జరిగిన అవకతవకలపై కేటీఆర్‌పై విచారణ జరిపేందుకు గవర్నర్ ఇదివరకే అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ అనుమతి పత్రాన్ని గవర్నర్ సీఎస్ శాంతికుమారికి (CS Shanthi kumari) పంపించారు. ఆ లేఖను ఏసీబీ (ACB) అధికారులకు అందజేయాలని తెలంగాణ క్యాబినెట్ నిర్ణయించింది. దీంతో ఈ అనుమతి లేఖను సీఎస్ శాంతి కుమారి ఏసీబీ అధికారులకు అందించారు.
ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్‌ను విచారణ
బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా ఈ రేస్ (formula e hyderabad) వ్యవహారంపై బుధవారం మంత్రివర్గంలో చర్చించారు. కేటీఆర్‌పై కేసు నమోదు చేసి గవర్నర్ ఇచ్చిన అనుమతిపై చర్చ సాగింది. ఈ వ్యవహారంపై ఇదివరకే నమోదైన కేసులో అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను, చీఫ్ ఇంజినీర్‌ను బాధ్యులుగా చేర్చారు. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో హెచ్‌ఎండీఏ ఒప్పందం చేసుకోవడం, ఆర్‌బీఐ అనుమతి లేకుండా విదేశీ కరెన్సీ చెల్లించడంపై పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలోనే కేటీఆర్‌పై (KTR) కేసు నమోదు చేయడానికి ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరింది. దాదాపు నెల రోజుల తరువాత గవర్నర్ అనుమతి ఇవ్వడంతో కేటీఆర్‌ను విచారించేందుకు సిద్ధమైంది. అసెంబ్లీ సమావేశాలు పొడిగించాలని, సాధ్యమైనన్ని అంశాలపై చర్చించే దమ్ముందా అని కేటీఆర్ అసెంబ్లీలో సవాల్ విసిరిన గంటల వ్యవధిలోనే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో కేటీఆర్ ఏ అరెస్టయ్యే అవకాశాలున్నాయి.






