హైదరాబాద్ ఫార్ములా ఈ రేసు (Formula E Race Case) వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఏసీబీ, ఈడీ దర్యాప్తు ముమ్మరం చేశాయి. తాజాగా కేటీఆర్ (KTR ACB Case)కు నోటీసులు జారీ చేయగా ఆయన విచారణకు హాజరయ్యేందుకు వచ్చి.. తన లాయర్ ను లోపలికి అనుమతించకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. లాయర్ ను అనుమతించమని ఏసీబీ చెప్పాలి కానీ పోలీసులు ఎందుకు చెబుతున్నారంటూ ప్రశ్నించారు. ఈ కేసులో ఏసీబీ మరోసారి ఆయనకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.
బీఆర్ఎస్ కు రూ.41 కోట్లు
ఇక ఈ కేసుపై తాజాగా రాష్ట్ర ప్రభుత్వం సంచలన వ్యాఖ్యలు చేసింది. రేసు నిర్వహించిన గ్రీన్కో (Green Co BRS) సంస్థ ఎన్నికల బాండ్ల ద్వారా బీఆర్ఎస్ పార్టీకి కోట్ల రూపాయల లబ్ధి చేకూరినట్లు పేర్కొంది. ఎన్నికల బాండ్ల ద్వారా ఈ సంస్థ బీఆర్ఎస్ కు రూ.41 కోట్లు చెల్లించినట్లు తెలిపింది. గ్రీన్కో, అనుబంధ సంస్థలు 2022 ఏప్రిల్ 8- అక్టోబర్ 10 మధ్య 26 సార్లు బాండ్లు కొన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఎలక్టోరల్ బాండ్స్ అంటూ రేవంత్ కొత్త డైవర్షన్ డ్రామా!
ఫార్ములా-ఈ కేసులో అవినీతి జరిగినట్టు ఏ ఆధారాలూ లభించకపోవడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త డైవర్షన్ డ్రామా మొదలుపెట్టింది.
బీఆర్ఎస్ పార్టీకి గ్రీన్కో సంస్థ ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చింది అని కొత్త రాగం అందుకున్నది రేవంత్… pic.twitter.com/LBNho4BfB1
— BRS Party (@BRSparty) January 6, 2025
బీజేపీ, కాంగ్రెస్ లకూ ఎన్నికల బాండ్లు
తెలంగాణ సర్కార్ ప్రకటనపై తాజాగా కేటీఆర్ (KTR On Green Co Electoral Bonds) స్పందించారు. గ్రీన్ కో సంస్థ 2022లో ఎన్నికల బాండ్లు ఇచ్చిందని.. 2023లో ఫార్ములా ఈ-రేసు జరిగిందని ఆయన తెలిపారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ (BJP)లకు కూడా గ్రీన్కో బాండ్లు ఇచ్చిందని వెల్లడించారు. ఫార్ములా ఈ-రేసు కారణంగా గ్రీన్కో నష్టపోయిందన్న కేటీఆర్.. పార్లమెంట్ ఆమోదించిన ఎన్నికల బాండ్లు అవినీతి ఎలా అవుతుందని ప్రశ్నించారు.







