Mana Enadu : “ప్రచారం కోసమే సినిమా వాళ్ల గురించి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రయత్నించారు. అటెన్షన్, డైవర్షన్ కోసమే సీఎం రేవంత్ రెడ్డి పాకులాడారు. సినిమా వాళ్లతో సెటిల్మెంట్ చేసుకొని ఇప్పుడు రేవంత్రెడ్డి మాట్లాడట్లేదు.” అంటూ మీడియాతో చిట్ చాట్ లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) వ్యవహారంపై స్పందిస్తూ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు.
కేసులతో భయపెడుతున్నారు
గురుకులాల్లో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు రాష్ట్ర సర్కార్ పరిహారం అందించాలని కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. రైతులు, చేనేతల మరణాలపైనా ముఖ్యమంత్రి స్పందించాలని కోరారు. కేసులతో భయపెట్టాలని చూస్తున్నారని.. ఇలాంటి వాటిని కచ్చితంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. తనపై పెట్టిన కేసులో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఆటో డ్రైవర్ల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
సంక్రాంతికి మరో మోసం
రైతు భరోసా (Rythu Bharosa) పేరుతో ప్రభుత్వం మోసం చేయబోతోంది. ఈ ప్రభుత్వం మా కంటే ఎక్కువగా అప్పులు చేసింది. ఓఆర్ఆర్ లీజు రద్దు చేసి సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. కాంగ్రెస్ ప్రభుత్వం డిస్ట్రక్షన్, డిస్ట్రాక్షన్, డైవర్షన్ చేస్తోంది. జమిలి ఎన్నికలతో పెద్దగా నష్టం లేదు. కాంగ్రెస్ క్యాడర్ కూడా ప్రశ్నిస్తోంది. ప్రజలు 6 గ్యారెంటీలు గురించి ప్రజలు అడుగుతున్నారని క్యాడరే మాట్లాడుతున్నారు. రైతు భరోసా పేరుతో సంక్రాంతికి ఇంకో మోసం చేస్తున్నారు. అంటూ కేటీఆర్ విమర్శించారు.







