
ఫార్ములా ఈ-కారు రేసు కేసు(Formula E-car race case)లో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR నేడు (జూన్ 16) మరోసారి విచారణకు హాజరుకానున్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్(Telangana Bhavan) నుంచి ఉదయం 10 గంటలకు ACB కార్యాలయానికి ఆయన వెళ్లనున్నారు. ఈ కేసులో నిధుల మళ్లింపు, క్యాబినెట్ అనుమతి లేకుండా నిధుల విడుదల, బిజినెస్ రూల్స్ ఉల్లంఘన వంటి అంశాలపై ఐదుగురు సభ్యుల ఏసీబీ బృందం KTRను విచారించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ కేసులో ఇప్పటికే సంబంధిత అధికారులను విచారించిన ఏసీబీ, ఆ తర్వాత కేటీఆర్‌నూ విచారించిన విషయం తెలిసిందే. నేటి విచారణ తర్వాత న్యాయస్థానంలో ఈ కేసుకు సంబంధించి ఏసీబీ ఫైనల్ ఛార్జిషీటు(Chargesheet) దాఖలు చేసే అవకాశముంది.
రూ.54.89 కోట్ల నిధుల దుర్వినియోగంపై కేసు
కాగా ఈ కేసులో కేటీఆర్‌కు మే 28న విచారణకు రావాలని ఏసీబీ నోటీసులు(ACB Notice) ఇచ్చింది. అయితే ఆ సమయంలో తాను విదేశీ పర్యటనకు వెళ్తున్నట్లు ఆయన సమాచారం ఇచ్చారు. దీంతో జూన్ 16న తమ ఎదుట హజరవ్వాలని ఇటీవల ఏసీబీ మరోసారి నోటీసులు జారీచేసింది. కాగా గత BRS ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో రూ.54.89 కోట్ల నిధుల దుర్వినియోగం(Misappropriation of funds) అయినట్లు గత డిసెంబర్ 29వ తేదీన ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.
కేటీఆర్ వెంట భారీ బీఆర్ఎస్ శ్రేణులు.. పోలీసుల భద్రత
ఇక ఈ ఏడాది జనవరి మొదట్లో విచారణకు హాజరయ్యే క్రమంలో అధికారులు అనుమతించకపోవడంతో కేటీఆర్ వెనక్కి వచ్చేశారు. ఆ సమయంలో ఆయన రాతపూర్వక వివరణ ఇచ్చారు. ఆ తర్వాత జనవరి 8న అర్వింద్‌కుమార్, జనవరి 9న కేటీఆర్, 10న HMDA బోర్డ్ మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డిని ఆ తర్వాత అదే నెల18న గ్రీన్‌కో ఏస్ నెక్స్ట్‌జెన్ MD చలమలశెట్టి అనిల్‌కుమార్‌ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. కాగా నేటి విచారణకు కేటీఆర్ హాజరుకానుండటంతో పెద్దయెత్తున బీఆర్ఎస్ శ్రేణులు ఆయన వెంట వెళ్లే అవకాశముండటంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేయనున్నారు.
𝐁𝐫𝐞𝐚𝐤𝐢𝐧𝐠 𝐍𝐞𝐰𝐬:
The ED questioning of BRS Working President KTR lasted for nearly seven hours. The investigation, which began at 10:30 AM, continued until 5:30 PM.
ED officials primarily focused on the Formula E Car Racing case and reportedly questioned KTR on… pic.twitter.com/tAgxZAH5tP
— Hyderabad Mail (@Hyderabad_Mail) January 16, 2025