కోలీవుడ్ హీరో ధనుష్(Dhanush), టాలీవుడ్ స్టార్ యాక్టర్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) కీలక పాత్రధారులుగా తెరకెక్కుతోన్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కుబేర’ (Kubera). క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Shekar Kammula) డైరెక్షన్ వహిస్తున్నారు. రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను సునీల్ నారంగ్(Sunil Narang), పుస్కుర్ రామ్ మోహన్‌రావు(Puskur Ram Mohan Rao) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ముంబై బ్యాక్ డ్రాప్ మాఫియా స్టోరీగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ క్లైమాక్స్‌కు చేరుకుంది. ప్రస్తుతం ప్రధాన పాత్రలపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ రిలీజ్(Release Date) డేట్‌పై ఓ క్రేజీ అప్డేట్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..
భిన్నమైన సోషల్ డ్రామాతో
భిన్నమైన సోషల్ డ్రామాతో తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే ఫిబ్రవరి మూడో వారంలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మూవీ టీమ్ చకచకా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు (Post production works) పూర్తి చేయాలని భావిస్తోందట. ఈ సినిమాలో కింగ్ నాగార్జున, ధనుష్ మునుపెన్నడు పోషించని పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఇరువురి ఫస్ట్ లుక్ పోస్టర్లు విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే ఇంత వరకూ రిలీజ్ తేదీపై సరైన క్లారిటీ రాలేదు. తాజాగా దానికి సంబంధించిన లీకులు బయటికొస్తున్నాయి. అయితే మూవీ విడుదల తేదీపై మేకర్స్ స్పందించాల్సి ఉంది.
తొలిసారి యాక్షన్ థ్రిల్లర్
కాగా శేఖర్ కమ్ముల(Shekar Kammula) ఇప్పటి వరకు ఎప్పుడూ చేయని విధంగా ఈసారి యాక్షన్ థ్రిల్లర్(Action thriller)గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఇలాంటి జానర్లో కమ్ములా ఇంతవరకూ సినిమా చేయలేదు. ఆయన సినిమాలు ఇంతవరకూ సాప్ట్‌గానే కనిపించాయి. శేఖర్ కమ్ముల సినిమాల్లో హీరోలు ఫైటింగ్ చేయడం, పొట్లాటలు వంటివి దాదాపు కనిపించవు. ఒకవేళ ఉన్నా అవి సరదాకి, లేకపోతే హీరోను కొందరు కొట్టడం వంటివి మాత్రమే కనిపించేవి. ఆనంద్(Anand), లీడర్(Leader), లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్(Life is beautiful) వంటివి ఈ జాబితాలోనివే. అయితే తొలిసారి ఆయన మార్క్‌ని పక్కనబెట్టి కాస్త కొత్తగా ట్రై చేస్తున్నారు. మరి ‘కుబేర’ కోసం ఏకంగా ఇద్దరి స్టార్లను రంగంలోకి దింపారు శేఖర్ కమ్ముల. దీంతో అభిమానుల్లో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.






