OTT: ఓటీటీలో సందడి చేయనున్న కుబేర.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్​ కమ్ముల(Shekar Kommala) దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) నటించిన తాజా చిత్రం ‘కుబేర’(Kubera). ఈ చిత్రం జూన్ 20న విడుదలై ఊహించని రీతిలో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కింగ్ నాగార్జున (Nagarjuna), పాన్ ఇండియా బ్యూటీ రష్మిక మందన్నా (Rashmika Mandanna) కీలక పాత్రల్లో నటించారు.

ఈ సినిమాలో ధనుష్ బిచ్చగాడిగా నటించగా, ఆయన పాత్రకి విశేష ప్రశంసలు లభిస్తున్నాయి. శేఖర్ కమ్ముల కథన శైలి, దర్శకత్వం సినిమాకు బలంగా నిలిచాయి. అలాగే నాగార్జున తొలిసారిగా డిఫరెంట్ షేడ్స్‌తో కనిపించి తనదైన నటనతో ఆకట్టుకున్నారు. రష్మిక కూడా తన పాత్రలో బాగా ఒదిగిపోయింది.

ఇప్పటికే కుబేర రూ. 150 కోట్లకు పైగా వసూలు చేసి, సూపర్ హిట్ టాక్‌ను తెచ్చుకుంది. ఈ విజయానికి సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ముఖ్య కారణంగా నిలిచింది. ఆయన బ్యాగ్రౌండ్ స్కోర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

ఇక థియేటర్లలో మంచి కలెక్షన్లు రాబడుతోన్న ఈ సినిమా, త్వరలో ఓటీటీలో విడుదల కానుంది. తాజా సమాచారం ప్రకారం, ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో(Amezon prime video) ఈ చిత్ర డిజిటల్ రైట్స్‌ను దక్కించుకుంది. దాదాపు రూ. 50 కోట్ల భారీ ధరకు ఈ డీల్ ఫైనల్ అయినట్టు తెలుస్తోంది.

ఈ చిత్రం జూలై(July) 20న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌కి రానున్నట్లు టాక్ నడుస్తోంది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. థియేటర్లతో పాటు ఓటీటీలోను కుబేర తన హవా కొనసాగించబోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *