అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) మల్టీస్టారర్‌గా నటించిన లేటెస్ట్ మూవీ ‘కుబేర(Kubera)’. క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Shekhar Kammula) తెరకెక్కించిన ఈ మూవీలో రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తోంది. హోలీ యాంటిసిపేటెడ్ మూవీగా రూపొందిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్(Sunil Narang), పుస్కుర్ రామ్ మోహన్ రావు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్(Posters), టీజర్, ట్రైలర్ సాంగ్స్(Songs) అన్ని మంచి రెస్పాన్స్‌ను దక్కించుకోవడంతో పాటు హైప్ పెంచాయి.
![]()
19 చోట్ల విజువల్స్ కట్ చేస్తూ నిర్ణయం
అయితే భారీ అంచనాల మధ్య ‘కుబేర(Kubera)’ జూన్ 20న తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈక్రమంలో.. తాజాగా, మూవీ మేకర్స్ సెన్సార్(Censor) పూర్తైయినట్టుల తెలుపుతూ రన్‌టైమ్(Run time)ను వెల్లడించారు. ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ రాగా.. ఏకంగా 3 గంటల 15 నిమిషాల రన్‌టైమ్‌తో రాబోతుందని తెలిపారు. 13+ సినిమాగా దీన్ని అభివర్ణించారు. అయితే, సెన్సార్ సర్టిఫికేషన్ తర్వాత సినిమా యూనిట్ 19 చోట్ల విజువల్స్ కట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మొత్తం విజువల్స్ డ్యూరేషన్ ఏకంగా 13 నిమిషాలు ఉండడం గమనార్హం. అలాగే ప్రేమ, దురాశ, థ్రిల్ అన్ని భావోద్వేగాలతో రాబోతుందని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
#Kubera U/A 3 hours 15 mins runtime #Censor pic.twitter.com/7KJKwWQ5oI
— கதைப்போமா🧢 (@magil_mainthan) June 14, 2025
కాగా ఇప్పటికే పాజిటివ్ బజ్‌ని అందుకున్న ఈ సినిమా US మార్కెట్‌లో గ్రాండ్ ప్రీమియర్స్‌కి పాన్ ఇండియా భాషల్లో రెడీ అవుతోంది. తాజాగా ఈమూవీ నుంచి మరోసాంగ్ రిలీజ్ అయింది. ‘నా కొడుకా’ అంటూ సాగే పాటకు నంద కిశోర్ లిరిక్స్ అందించారు. దేవిశ్రీ ప్రసాద్(DSP) మ్యూజిక్ ఇచ్చిన ఈ పాటను సింధూరి విశాల్ ఆలపించారు.






