
ఉత్తరప్రదేశ్(UP)లోని ప్రయాగ్‌రాజ్‌లో ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా(Maha Kumbha Mela) నిర్వీరామంగా కొనసాగుతోంది. జనవరి 13 నుంచి జరుగుతున్న ఈ మహా కార్యక్రామానికి దేశవిదేశాల నుంచి భక్తులు తరలివచ్చి త్రివేణీ సంగమం(Triveni Sangamam)లో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ కుంభమేళాకు దాదాపు 35 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు సమాచారం. ఈనెల 26వ తేదీ వరకు ఈ ఆధ్యాత్మిక వేడుక కొనసాగనుంది. ఇదిలా ఉండగా గత నెల 29న మౌని అమావాస్య సందర్భంగా త్రివేణీ సంగమంలోని సంగం ఘాట్(Sangam Ghat) వద్ద తొక్కిసలాట చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. తాజాగా ఈ ఘటనపై సుప్రీంకోర్టు(Supreme Court) స్పందించింది.
పిల్ స్వీకరణకు సుప్రీం నిరాకరణ
తొక్కిసలాట(Stampede Incident) దుర్ఘటనపై యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం(Yogi Adityanath Govt) బాధ్యత వహించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్(Petition) దాఖలు అయింది. విశాల్ తివారీ అనే న్యాయవాది ఈ వ్యాజ్యాన్ని వేశారు. కాగా, దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ పిల్(pill)ను స్వీకరించడానికి నిరాకరించింది. ఇది ఒక దురదృష్టకర సంఘటనగా సుప్రీంకోర్టు పేర్కొంది. అలాగే పిల్ వేసిన న్యాయవాదిని తన పిటిషన్‌తో అలహాబాద్ హైకోర్టు(Allahabad High Court)కు తరలించాలని న్యాయస్థానం సూచించింది.
పార్లమెంట్‌లో చర్చకు ప్రతిపక్షాల డిమాండ్
అటు ఈ తొక్కిసలాట ఘటనపై స్పందించిన యూపీ ప్రభుత్వం(UP Govt).. మృతుల కుటుంబాలకు రూ. 25లక్షల చొప్పున పరిహారం(Compensation) ఇస్తామని ప్రకటించింది. అయితే, ఈ ఘటనపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఇందులో భాగంగా ఈ ఘటనపై పార్లమెంట్‌లో చర్చ జరపాలని(A debate should be held in Parliament), మృతుల సంఖ్యపై పూర్తి సమాచారాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు పార్లమెంట్‌లో నిరసనకు సైతం దిగాయి.