
జమ్ముకశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack)లో లష్కరే తోయిబా హస్తం ఉందని భావిస్తున్న భారత భద్రతా బలగాలు ఆ ఉగ్రవాదులపై నిఘా పెట్టాయి. ఈ క్రమంలో వారి ఇండ్లలో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో భారీ పేలుళ్లు (Terrorist House Blast) సంభవించాయి. అయితే ఈ పేలుళ్ల నుంచి భారత జవాన్లు త్రుటిలో తప్పించుకున్నారు. ఇండియ్ ఆర్మీని ట్రాప్ చేసేందుకే లష్కరే తోయిబాకు చెందిన ఆసిఫ్ పౌజీ అలియాస్ ఆసిఫ్ షేక్, ఆదిల్ హుస్సేన్ థోకర్ అలియాస్ ఆదిల్ గురి అనే ఉగ్రవాదుల ఇండ్లలో యాక్టివేట్ చేసిన ఐఈడీలు పెట్టినట్లు అధికారులు తెలిపారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
పహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదుల నివాసాల్లో భద్రతా దళాలు తఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలోనే దక్షిణ కశ్మీర్‌లోని త్రాల్‌కు చెందిన ఆసిఫ్ షేక్ ఇంటికి వెళ్లాయి. అక్కడ పేలుడు పదార్థాలు ఉన్నాయని గుర్తించిన బలగాలు.. అవి యాక్టివేట్ అయినట్లు గమనించి వెంటనే అప్రమత్తమై బయటకు పరుగులు తీశాయి. భారత భద్రతా బలగాలు బయటకు వచ్చిన కాసేపటికే భారీగా పేలుళ్లు సంభవించాయి. ఇదే విధంగా అనంత్ నాగ్ జిల్లాలోని బిజ్బెహారా బ్లాక్‌లోని గురి గ్రామానికి చెందిన ఆదిల్ గురి నివాసంలోనూ పేలుళ్లు జరిగాయి.
ఆర్మీ జవాన్లు ట్రాప్
సోదాలు నిర్వహించేందుకు వచ్చిన సమయంలో భారత ఆర్మీ జవాన్లను ట్రాప్ చేయాలనే ఉద్దేశంతో ఉగ్రవాదులు ముందుగానే తమ ఇండ్లలో యాక్టివేట్ చేసిన ఐఈడీలు అమర్చి ఉంటాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కావాలనే ఈ నివాసాల సమాచారం భద్రతా దళాలకు అందేలా ప్లాన్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.