మనఈనాడు:తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ చెదురు మదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. రాత్రి పొద్దుపోయే వరకు పోలింగ్ నమోదైంది.
తెలంగాణలో గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంత వాతావరణంలో జరిగింది. రాత్రి పొద్దుపోయే వరకు పోలింగ్ నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 70.66శాతం పోలింగ్ జరిగింది. ఇంకొంతం పెరిగే అవకాశం ఉంది. మునుగోడులో అత్యధికంగా 91.51శాతం పోలింగ్ నమోదు కాగా, యాకుత్ పురలో అత్యల్పంగా 39.69శాతం పోలింగ్ నమోదైంది. వాస్తవ ఓటింగ్ పై నేడు ఈసీ ప్రకటన చేయనుంది.
3న ఫలితాలు ఈవీఎం బాక్సుల్లో నేతల భవితవ్యం ఉంది. ఈనెల 3న (ఆదివారం) ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ తమతమ సర్వేలను వెల్లడించాయి. అయితే, గెలుపు ధీమాపై నేతలు ఉన్నారు. సాయంత్రం 5గంటల తరువాత జరిగిన ఓటింగ్ పైనే అభ్యర్థులు గెలుపు ఆశలు పెట్టుకున్నారు.
ఎగ్జిట్ పోల్స్
ఛత్తీస్‌గఢ్ , మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. రాజస్థాన్‌లో బీజేపీకి పట్టంకట్టాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో కొన్ని బీఆర్ఎస్ పార్టీకి, మరికొన్ని కాంగ్రెస్ పార్టీకి పట్టంకట్టాయి. దీంతో 3న వెలువడే ఫలితాలపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.