మెగా కోడలు ‘సతీ లీలావతి’ సినిమా ప్రారంభం

మెగా కోడలు లావ‌ణ్య త్రిపాఠి (Lavanya Tripathi), మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహన్ (Dev Mohan) ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఓ సినిమా రాబోతోంది. భీమిలీ కబడ్డీ జట్టు ఫేం తాతినేని స‌త్య దర్శకత్వంలో ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చ‌ర్స్‌, ట్రియో స్టూడియోస్ ప‌తాకాల‌ సంయుక్త నిర్మాణ సారథ్యంలో వస్తున్న ఈ సినిమాకు సతీలీలావతి అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

సతీలీలావతి షూటింగ్ ప్రారంభం 

నాగమోహ‌న్ బాబు.ఎమ్‌, రాజేష్‌.టి ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సోమవారం ఉద‌యం ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మం జరిగింది. రామోజీ ఫిల్మ్ సిటీలోని సంఘి హౌస్‌లో ఈ సినిమా ప్రారంభమైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి నిర్మాత హ‌రీశ్ పెద్ది క్లాప్ కొట్టారు.  మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ (Varun Tej) కెమెరా స్విచ్ ఆన్ చేయ‌గా, సీనియ‌ర్ డైరెక్ట‌ర్‌ టి.ఎల్‌.వి.ప్ర‌సాద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

అందరూ నవ్వుకునే ఎంటర్టైనర్

ఈ కార్య‌క్ర‌మంలో మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, చిత్ర స‌మ‌ర్ప‌కులు జెమినీ కిర‌ణ్‌, నిర్మాతలు హ‌రీష్ పెద్ది, వి.ఆనంద ప్ర‌సాద్, అన్నే ర‌వి, డైరెక్ట‌ర్ తాతినేని స‌త్య తండ్రి, సీనియ‌ర్ డైరెక్ట‌ర్‌ టి.ఎల్‌.వి.ప్ర‌సాద్ ప్ర‌ముఖులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు మ‌న‌స్ఫూర్తిగా న‌వ్వుకునే రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ‘సతీ లీలావతి (Sathi Leelavathi)’ సినిమా రానుంది.

Related Posts

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *