Mana Enadu : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రతి నెల విడుదల చేసినట్లు 2024 ఏడాదికి సంబంధించి చివరి నెల అయిన డిసెంబర్ (December) నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల జాబితాను తాజాగా రిలీజ్ చేసింది. దేశంలోని వివిధ బ్యాంకులకు ఈ నెలలో ఏకంగా 17 రోజుల పాటు సెలవులున్నాయి. వీటిలో కొన్ని నేషనల్ హాలిడేస్, రీజనల్ హాలిడేస్ ఉన్నాయి. బ్యాంకులకు వెళ్లే కస్టమర్లు ఈ సెలవుల(Bank Holidays)ను దృష్టిలో ఉంచుకుని తమ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవాలని బ్యాంకింగ్ రంగ నిపుణులు సూచించారు.
2024 డిసెంబర్ బ్యాంక్ సెలవుల జాబితా ఇదే
- డిసెంబర్ 1 (ఆదివారం) :
- డిసెంబర్ 3 (మంగళవారం) : సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఫీస్ట్ పురస్కరించుకుని గోవాలోని బ్యాంకులకు సెలవు.
- డిసెంబర్ 8 (ఆదివారం) :
- డిసెంబర్ 12 (గురువారం) : పా-టోగన్ నెంగ్మింజ సంగ్మా నేపథ్యంలో మేఘాలయలో బ్యాంకులకు హాలిడేస్.
- డిసెంబర్ 14 (శనివారం) : రెండో శనివారం సందర్భంగా బ్యాంకులకు హాలిడే.
- డిసెంబర్ 15 (ఆదివారం) :
- డిసెంబర్ 18 (బుధవారం) : యు సోసో థామ్ వర్థంతి సందర్భంగా మేఘాలయలో బ్యాంకులు పనిచేయవు.
- డిసెంబర్ 19 (గురువారం) : గోవా విమోచన దినం సందర్భంగా ఆ రాష్ట్రంలో బ్యాంకులకు హాలీడే.
- డిసెంబర్ 22 (ఆదివారం) :
- డిసెంబర్ 24 (మంగళవారం) : క్రిస్మస్ ఈవ్ సందర్భంగా మిజోరం, నాగాలాండ్, మేఘాలయ బ్యాంకులకు సెలవు.
- డిసెంబర్ 25 (బుధవారం) : క్రిస్మస్ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులన్నింటికీ హాలిడే.
- డిసెంబర్ 26 (గురువారం) : క్రిస్మస్ పురస్కరించుకుని మిజోరం, నాగాలాండ్, మేఘాలయల్లోని బ్యాంకులకు సెలవు.
- డిసెంబర్ 27 (శుక్రవారం) : మిజోరం, నాగాలాండ్, మేఘాలయల్లోని బ్యాంకులకు క్రిస్మస్ హాలీడే.
- డిసెంబర్ 28 (శనివారం) : నాలుగో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
- డిసెంబర్ 29 (ఆదివారం) :
- డిసెంబర్ 30 (సోమవారం) : యు కియాంగ్ నంగ్బా సందర్భంగా మేఘాలయలో బ్యాంకులకు హాలిడే
- డిసెంబర్ 31 (మంగళవారం) : లాసాంగ్/నామ్‌సూంగ్ (నూతన సంవత్సరం) సందర్భంగా మిజోరం, నాగాలాండ్, మేఘాలయలోని బ్యాంకులకు సెలవు.






