తెలుగు రాష్ట్రాల ప్రజలు సంక్రాంతి (sankranti 2025) సంబురాలకు సిద్ధమయ్యారు. ఓవైపు సొంతూళ్లకు వెళ్లేందుకు ఇప్పటికే కొందరు టికెట్లు బుక్ చేసుకున్నారు. మరికొందరు టికెట్ల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకోవైపు సినీ ప్రియులు మాత్రం ఏయే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి..? వాటికి టికెట్లు ఎప్పుడెప్పుడు బుక్ చేసుకుందామా అని ఎదురుచూస్తున్నారు. ఇక కొందరు ఎలాంటి సినిమాలు (sankranti Movies Telugu), వెబ్ సిరీస్ లు ఓటీటీల్లో రిలీజ్ కు రెడీ ఉన్నాయో ఈ సంక్రాంతి హాలిడేస్ లో ఏయే చిత్రాలు, సిరీస్ లు చూడాలో లిస్టు ప్రిపేర్ చేసుకుంటున్నారు. మరి ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లలో, ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏవో ఓసారి చూసేద్దామా..?
థియేటర్లలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే
- గేమ్ ఛేంజర్ – జనవరి 10
- డాకు మహారాజ్ – జనవరి 12
- సంక్రాంతికి వస్తున్నాం – జనవరి 14
ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలు/సిరీస్‌లు ఇవే!
అమెజాన్ ప్రైమ్
- ఫోకస్ (హాలీవుడ్) జనవరి 10
జీ5
- సబర్మతి రిపోర్ట్ (హిందీ) జనవరి 10
నెట్‌ఫ్లిక్స్
- బ్లాక్ వారెంట్ (హిందీ సిరీస్) జనవరి 10
- లెజెండ్ ఆఫ్ ఫ్లఫ్పీ (స్టాండప్ కామెడీ షో) జనవరి 07
- జెర్రీ స్ప్రింగర్ (డాక్యుమెంటరీ) జనవరి 07
- ది అన్‌షాప్ 6 (వెబ్‌సిరీస్) జనవరి 09
- గూస్‌బంప్స్ (వెబ్‌సిరీస్) జనవరి 10
జియో సినిమా
- రోడీస్ డబుల్ క్రాస్ (రియాల్టీ షో) జనవరి 11
సోనీలివ్
- షార్క్ ట్యాంక్ ఇండియా 4 (రియాల్టీ షో) జనవరి 06






