
BRS MLC కల్వకుంట్ల కవిత(Kavith) తెలంగాణ సర్కార్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. బీసీ రిజర్వేషన్ల(BC Reservations) అంశం పరిష్కారం కాకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు(Local body elections) నిర్వహించాలని చూస్తోందని మండిపడ్డారు. ఒకవేళ 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలకు వెళ్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రిజర్వేషన్లు సంగతి తేల్చాకే ఎన్నికలకు వెళ్లాలని స్పష్టం చేశారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) 51 సార్లు ఢిల్లీ వెళ్లొచ్చి గిన్నీస్ రికార్డు(Guinness record) సొంతం చేసుకున్నారని ఎద్దేవా చేశారు.
దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతాం
ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. “సీఎం రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లకు అనుమతి తీసుకువస్తేనే నామినేషన్లు(Nominations) వేయనిస్తాం. లేదంటే ప్రతి వార్డులో వందల సంఖ్యలో నామినేషన్లు వేసి ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేస్తాం” అని కవిత అన్నారు. పార్లమెంటులో ఈ బిల్లును కేంద్రం ఆమోదించకపోతే దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆమె తెలిపారు. “జులై రెండో వారం వరకు కేంద్రానికి గడువు ఇస్తున్నాం. ఆలోపు అనుమతి రాకపోతే జులై 17 నుంచి రైలు రోకో(Rail Roko)లు నిర్వహిస్తాం” అని కవిత హెచ్చరించారు. వచ్చే నెల 16, 17, 18 తేదీల్లో ప్రజలు ఎలాంటి రైలు ప్రయాణాలు పెట్టుకోవద్దని కోరారు.
ఢిల్లీకి వెళ్లడంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఒక్క సారి కూడా బీసీ బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించకపోవడం దారుణం – @RaoKavitha pic.twitter.com/C5hcWfH1DK
— Kalvakuntla Kavitha Office (@OfficeOfKavitha) June 18, 2025