బంగాళఖాతంలో ( Bay of Bengal) అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, (Andhra Pradesh) తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండగా.. తెలంగాణలో అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి. శనివారం బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో వర్షాలుకురుస్తున్నట్లు పేర్కొంది. భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం. .ఆదివారం రాత్రి లోపు అల్పపీడనం బలపడే అవకాశముంది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న హిందూ మహా సముద్రం (Indian Ocean) మీదుగా ఉన్న ఆవర్తన ప్రభావంతో ఈ అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఓ ప్రకటనలో తెలిపింది.
తమిళనాడుకు భారీ వర్ష సూచన
అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కొనసాగుతూ.. డిసెంబర్ 11 నాటికి శ్రీలంక-తమిళనాడు తీరంలోని నైరుతి బంగాళాఖాతం సమీపానికి చేరుకునే అవకాశం ఉందని ఐఎండీ చెప్పింది. అల్పపీడన ప్రభావంతో డిసెంబర్ 11, 12 తేదీల్లో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (Indian Meteorological Department) తెలిపింది. ముఖ్యంగా ఈ సమయంలో తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు మరియు కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురవనున్నాయని చెప్పారు.
అల్పపీడనం ప్రభావంతో ఆదివారం తెలంగాణ (Telangana) వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం (Indian Meteorological Department) హెచ్చరించింది. ఈ రోజు వేకువజామున హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. సిద్దిపేట, మెదక్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జిల్లాలో వర్షం పడుతోంది. అకాల వార్షాల కారణంగా చేతికందిన వరి, మిర్చి పంట తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు