LPG Cylinder Prices: కేవలం రూ.240కే గ్యాస్ సిలిండర్ కొనొచ్చు ఇలా.

Gas Cylinder Price | మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ప్రస్తుతం మార్కెట్‌లో పలు రకాల గ్యాస్ (Gas) సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. 2 కేజీల దగ్గరి నుంచి 19 కేజీల వరకు సిలిండర్లు (LPG Cylinder) ప్రస్తుతం లభిస్తున్నాయి. ఇంకా ఎక్కువ పరిమాణంలో ఉన్న సిలిండర్లు కూడా ఉంటాయి. మనం ఇప్పుడు ఏ ఏ సిలిండర్ ధర ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం. సిలిండర్ పరిమాణం ఆధారంగా రేటు కూడా మారుతుంది. అందువల్ల ఏ ఏ గ్యాస్ సిలిండర్ రేటు ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

మార్కెట్‌లో 2 కేజీలు, 5 కేజీలు, 10 కేజీలు, 14.2 కేజీలు, 19 కేజీలు ఇలా పలు రకాల పరిమాణాల్లో గ్యాస్ సిలిండర్లు లభిస్తున్నాయి. సాధారణంగా ఇళ్లలో ఉపయోగించే సిలిండర్లలో 14.2 కేజీల గ్యాస్ ఉంటుంది. ఎక్కువ మంది వీటినే కలిగి ఉంటారు. ఈ సిలిండర్ ధర రూ. 1155 వద్ద ఉంది. అలాగే ఇంకా ఇటీవల కాలంలో 10 కేజీల గ్యాస్ సిలిండర్లకు కూడా డిమాండ్ నెలకొంది. ఇవి కొత్తగా మార్కెట్‌లోకి వచ్చాయి. వీటిని కంపొసైట్ గ్యాస్ సిలిండర్లు అని కూడా పిలుస్తూ ఉంటారు.

ఈ 10 కేజీల గ్యాస్ సిలిండర్ ధర తక్కువగా ఉంటుంది. ఎందుకంటే 14.2 కేజీల కన్నా ఇందులో తక్కువ గ్యాస్ ఉంటుంది. మీరు ఈ సిలిండర్‌ను రూ. 822కు కొనొచ్చు. మీరు 14.2 కేజీల గ్యాస్ కనెక్షన్ కలిగి ఉంటే 14.2 కేజీల సిలిండర్ మాత్రమే ఉపయోగించగలరు. అదే 10 కేజీల సిలిండర్ కొనాలంటే.. గ్యాస్ కనెక్షన్ కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. తర్వాతనే మీరు 10 కేజీల కంపొసైట్ గ్యాస్ సిలిండర్ కొనుగోల చేయగలరు. అలాగే మార్కెట్‌లో ఇంకా ఇతర తక్కువ పరిమాణంలోని సిలిండర్లు కూడా ఉన్నాయి.

5 కేజీల సిలిండర్ కూడా ఉంది. మీరు దీన్ని సులభంగానే కొనొచ్చు. దీని రేటు రూ. 423గా ఉంది. మీరు దగ్గరిలోని ఇండేన్ డిస్ట్రిబ్యూటర్ వద్దకు వెళ్లి ఈ సిలిండర్ కొనొచ్చు. లేదంటే బయటి షాపుల్లో కూడా వీటిని విక్రయిస్తూ ఉంటారు. అలాగే 2 కేజీ సిలిండర్ కూడా ఉంది. దీని రేటు ఇంకా తక్కువ. మీరు దీన్ని రూ.240కు కొనుగోలు చేయొచ్చు. అలాగే 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర విషయానికి వస్తే.. ఈ సిలిండర్ రేటు రూ. 1918గా ఉంది. అలాగే 47.5 కేజీల సిలిండర్లు కూడా ఉంటాయి. దీని రేటు రూ. 4800 ఉంటుంది.

  • Related Posts

    Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

    కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

    ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

    మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *