IPL 2025లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(GT)కి లక్నో సూపర్ జెయింట్స్(LSG) షాక్ ఇచ్చింది. ఈ మ్యాచులో గుజరాత్ టైటాన్స్‌ను 33 పరుగుల తేడాతో ఓడించింది. ఈ సీజన్‌లో లక్నో ఆడిన 13 మ్యాచ్‌ల్లో ఇది ఆరో విజయం కాగా.. ఈ గెలుపు ఆ జట్టుకు ప్రత్యేక ప్రయోజనమేమీ చేకూర్చదు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు తరఫున మిచెల్ మార్ష్ సెంచరీ(117), నికోలస్ పూరన్ హాఫ్ సెంచరీ(56*)తో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్ల నష్టానికి 235 భారీ స్కోరు సాధించింది. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్, సాయి కిషోర్ తలో వికెట్ తీశారు.
షారుఖ్, రూథర్‌ఫోర్డ్ పోరాడినా…
అనంతరం ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో GT 9 వికెట్లు కోల్పోయి 202 పరుగులు మాత్రమే చేయగలిగింది. బ్యాటర్లు విఫలమవడంతో GT తన సొంత మైదానంలో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. షారుఖ్ ఖాన్(57), రూథర్‌ఫోర్డ్(38) అద్భుతంగా బ్యాటింగ్ చేసినా మిగతా వారు సపోర్టు చేయలేదు. GT విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న సాయిసుదర్శన్(21), శుభ్ మన్ గిల్(35), జోస్ బట్లర్(33) ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు చేయలేకపోయారు. రాహుల్ తెవాటియా(2) కూడా నిరాశపరిచారు. LSG బౌలర్లలో విలియా ఓరూర్కే 2 వికెట్లు పడగొట్టగా.. ఆయుష్ బదోని, అవేష్ ఖాన్ తలో 2 వికెట్లు తీశారు. ఆకాశ్ మహరాజ్ సింగ్, షాబాజ్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.
సంచలనం సృష్టించిన మార్ష్-పూరన్
కాగా GT ఇన్నింగ్స్‌లో మార్ష్(Marsh), పూరన్(Pooran) ఆటే హైలైట్‌గా నిలిచింది. తొలుత ఐడెన్ మార్‌క్రమ్, మిచెల్ మార్ష్ తొలి వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మార్‌క్రమ్ 24 బంతుల్లో 36 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత, మార్ష్, పూరన్ బాధ్యతలు స్వీకరించారు. మార్ష్ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. తన ఐపీఎల్ కెరీర్‌లో తొలి సెంచరీ(First Century) సాధించాడు. మార్ష్ 64 బంతులు ఎదుర్కొని 117 పరుగులు చేశాడు. అదే సమయంలో, పురాన్ 27 బంతుల్లో 207 స్ట్రైక్ రేట్‌తో అజేయంగా 56 పరుగులు చేశాడు.
LSG BEAT TABLE TOPPERS GUJARAT TITANS TWICE IN IPL 2025..#GTvsLSG pic.twitter.com/3LKyPvTCQc
— Howzzat Zone (@HowzzatZone) May 22, 2025






