MadSquare: కలర్‌ఫుల్లుగా ‘మ్యాడ్ స్క్వేర్’ సక్సెస్ మీట్.. హాజరైన NTR

నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘మ్యాడ్ స్క్వేర్(Mad Square)’. ‘మ్యాడ్‌’ (Mad)’ చిత్రానికి సీక్వెల్‌గా డైరెక్టర్ కళ్యాణ్ శంకర్(Director Kalyan Shankar) తెరకెక్కించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో సూర్యదేవర నాగవంశీ(Suryadevara Nagavamsi) ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 28న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్ టాక్‌తో దూసుపోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఇవాళ హైదరాబాద్‌లో సక్సెస్ మీట్(Success Meet) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్టుగా, త్రివిక్రమ్ శ్రీనివాస్, మూవీ ప్రొడ్యూసర్స్, టెక్నికల్ టీమ్ తదితరులు హాజరయ్యారు.

‘NTR For MAD’ వీడియో.. తారక్ భావోద్వేగం

ఈ సందర్భంగా మూవీ టీమ్ ఆయనపై రూపొందించిన ‘NTR For MAD’ వీడియోను ప్రదర్శించింది. గతంలో ఎన్టీఆర్ మాట్లాడిన కామెంట్స్, ఫ్యాన్స్ ఆయనపై చూపించిన అభిమానాన్ని ఇందులో పొందుపర్చారు. గూస్‌బంప్స్ తెప్పించే ఈ వీడియోను చూస్తూ ఎన్టీఆర్ కాస్త ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఎన్టీఆర్ మాట్లాడుతుండగా డైరెక్టర్ కళ్యాణ్ శంకర్(Director Kalyan Shankar) తారక్ కాళ్లకు మొక్కేందుకు ప్రయత్నించగా.. ఎన్టీఆర్ అడ్డుకొని ‘‘భలేవారు బాబోయ్.. ఇలా చేస్తే నేనిక్కడ నుంచి వెళ్లిపోతా, కాళ్లకు నమస్కరించాలనుకుంటే మీ తల్లిదండ్రులకు పెట్టండి’’ అని అనడంతో స్టేజంతా కేరింతలతో మారుమోగింది.

అలాగే తన తర్వాతి సినిమా గురించి ‘‘ ప్రస్తుతం ఒకటి చేస్తున్నా.. దాని గురించి ఆ ఒక్కడు తర్వలోనే మీ అందరికీ చెబుతాడు’’ అని ఇన్ డైరెక్టుగా ప్రేక్షకులకు తెలిపాడు ఎన్టీఆర్. అంతకుముందు ఎన్టీఆర్‌ ‘ఆంధ్రావాలా’ సినిమాలోని ‘నైరే నైరే’ అనే పాటకు డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ డ్యాన్స్‌ చేసి, ఆయనపై అభిమానాన్ని చాటుకున్నారు.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *