ప్రజా సమస్యలపై నా పోరాటం ఆగదు: మడుపల్లి గోపాలరావు

ఎర్రజెండాను అణిచివేసే ధైర్యం ఎవరికీ లేదని, ఒకవేళ అదే చేయాలనుకుంటే ఎర్రజెండా మరింత ఎరుపెక్కుతుందని సీపీఎం కీలక నేత మడుపల్లి గోపాలరావు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాడుతామని ఆయన మరోసారి స్పష్టం చేశారు. గత పదేళ్లుగా చింతకాని మండల సీపీఎం కార్యదర్శిగా ఆయన విశేష సేవలు అందిస్తున్న గోపాలరావుకు తగిన గుర్తింపు లభించింది. ఈ మేరకు శనివారం ఆయనను మధిర డివిజన్ (MADHIRA) కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా గోపాలరావు విద్యార్థి దశ నుంచే ప్రజాపోరాటాల్లో క్రియాశీలకంగా పనిచేశారు.

చిన్నతనం నుంచే ప్రజా క్షేత్రంలోకి..

చిన్నతనం నుంచే ప్రజా, స్థానిక సమస్యలపై గళం విప్పారు. ఆయన సేవలకు పార్టీ అధిష్ఠానం కూడా అతనిని చింతకాని మండల కార్యదర్శిగా మూడు పర్యాయాలు కొనసాగించింది. తాజాగా ఆయనకు మధిర డివిజన్ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది. ఈ సందర్భంగా మడుపల్లి గోపాలరావు మాట్లాడుతూ.. గత పదేళ్లుగా తన వెంటూ ప్రజాపోరాటంలో పాలుపంచుకుంటున్న కార్యకర్తలకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తనపై ప్రజలు చూపించిన ఆత్మీయత, సహాయ సహకారాలను గుర్తు చేసుకున్నారు. ఇకపై కూడా పార్టీకి, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతానని తెలిపారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *