మహారాష్ట్ర ఎన్నిల్లో (Maharashtra Election) 2024ఎన్డీయే కూటమి మహాయుతి భారీ మెజార్జీతో విజయం సాధించింది. 288 స్థానాలకు గానూ శనివారం మధ్యాహ్నం మూడు గంటల సమయానికి 159 స్థానాల్లో గెలుపొందిన కూటమి.. ఇంకా 70 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. తిరుగులేని విజయం సాధించిన కూటమికి ప్రముఖలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit shah) మాట్లాడుతూ.. కూటమి ఘనవిజయానికి కృషి చేసిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు, దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్‌లకు ఫోన్లో ఆయన అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) మాట్లాడుతూ ‘‘మహారాష్ట్రలో చారిత్రక విజయం సొంతం చేసుకున్న మహాయుతి కూటమికి శుభాకాంక్షలు. ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రజలకున్న విశ్వాసానికి ఈ విజయం ప్రతిబింబంగా నిలుస్తోంది. ప్రధాని వ్యూహాత్మక దార్శనికత, విధానాలు, ప్రజల పట్ల నిబద్ధత వికసిత్ భారత్ లక్ష్యానికి బాటలు పరుస్తున్నాయి’’ అని ప్రశంసించారు.
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (yogi adityanath) X వేదికగా ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ‘ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజయవంతమైన నాయకత్వంపై ప్రజలకు ఉన్న అచంచలమైన విశ్వాసానికి ఈ విజయం నిదర్శనం’ అని అన్నారు.
‘అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-మహాయుతి కూటమి చారిత్రాత్మక విజయం అందించిన మహారాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక అభినందనలు! ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో, బీజేపీ-మహాయుతి అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తుంది’ అని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ (Nitin Gadkari) అన్నారు. వీరితోపాటు పలువురు ప్రముఖులు కూటమికి శుభాకాంక్షలు తెలిపారు.