
హొంబలే ఫిల్మ్స్(Hombale Films) సమర్పణలో డైరెక్టర్ అశ్విన్ కుమార్(Ashwin Kumar) తెరకెక్కించిన యానిమేటెడ్ చిత్రం ‘మహావతార్ నరసింహ(Mahavatar Narasimha)’. బడ్జెత్‌తో తెరకెక్కిన ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. జులై 25న తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం, ఎలాంటి పెద్ద ప్రమోషన్స్(Promotions) లేకుండా సైలెంట్‌గా థియేటర్లలోకి వచ్చి సంచలనం సృష్టిస్తోంది. కేవలం 6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, అన్ని భాషల్లో 14 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగ రూ. 136 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లతో భారతీయ యానిమేషన్ చరిత్రలో అత్యధిక కలెక్షన్లు(Collections) సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది.
హిందీ వెర్షన్‌లో రూ. 84.44 కోట్లకు పైగా వసూళ్లు
తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.15 కోట్ల షేర్‌ను దాటగా, హిందీ వెర్షన్ రూ. 84.44 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మొదటి రోజు రూ. 1.35 కోట్లతో ప్రారంభమైన హిందీ వెర్షన్, 9వ రోజున రూ. 11.25 కోట్లు సాధించి అద్భుత ప్రదర్శన కనబరిచింది. విజువల్ గ్రాండియర్, అద్భుతమైన యానిమేషన్, హృదయాన్ని హత్తుకునే సంగీతం, పౌరాణిక కథాంశంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్రహ్లాదుడి భక్తి, నరసింహుడి ఉగ్రరూపాన్ని శక్తిమంతంగా చిత్రీకరించిన ఈ సినిమా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీంతో జనం జేజేలు పలుకుతున్నారు.
#MahavatarNarsimha [#Hindi version] posts a remarkable total in Week 2… In fact, the Week 2 total is 57.28% HIGHER than Week 1, which is nothing short of sensational.
The march towards the ₹ 💯 cr milestone has begun. #MahavatarNarsimha [Week 2] Fri 5.30 cr, Sat 11.25 cr,… pic.twitter.com/rR5iooRGTL
— taran adarsh (@taran_adarsh) August 8, 2025
‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా, ఈ చిత్రం విష్ణుమూర్తి(Vishnumurthy) అవతారాలను ఆధునిక సాంకేతికతతో, హాలీవుడ్(Hollywood) స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌తో అందిస్తోంది. 2027లో ‘మహావతార్ పరశురామ్’ సహా మరో ఆరు చిత్రాలు రానున్నాయి. ఈ సినిమా విజయం భారతీయ యానిమేషన్ స్థాయిని ప్రపంచ వేదికపై నిలబెట్టింది.