Mahavatar Narasimha: రూ.40 కోట్లతో తెరకెక్కి రూ.300 కొల్లగొట్టిన యానిమేటెడ్ మూవీ!

భారతీయ సినిమా చరిత్రలో యానిమేషన్ చిత్రాలు(Animated Movies) భారీ విజయాలు సాధించడం చాలా అరుదు. అయితే, ఈ అంచనాలను తలకిందులు చేస్తూ ‘మహావతార్ నరసింహ(Mahavatar Narasimha)’ బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. జులై 25న విడుదలైన ఈ యానిమేటెడ్ పౌరాణిక చిత్రం(Animated mythological film), కేవలం రూ.40 కోట్ల బడ్జెట్‌(Budget)తో తెరకెక్కి, ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల గ్రాస్ కలెక్షన్ల(Collections)ను రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ చిత్రం భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేషన్ సినిమాగా రికార్డు నెలకొల్పింది. అశ్విన్ కుమార్(Ashwin Kumar) దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్(Hombale Films), క్లీమ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం, విష్ణుమూర్తి దశావతారాల్లో నరసింహ అవతార కథను ఆధారంగా తెరకెక్కింది.

ఐదు వారాల పాటు థియేటర్లలో హౌస్‌ఫుల్‌

హిరణ్యకశిపుడు(Hiranyakashipa), ప్రహ్లాదుడు(Prahladha) కథాంశంతో రూపొందిన ఈ సినిమా, అద్భుతమైన VFX, భావోద్వేగ నరేషన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. స్టార్ హీరోలు లేకపోయినా, మౌత్ టాక్‌తో ఈ చిత్రం ఐదు వారాల పాటు థియేటర్లలో హౌస్‌ఫుల్‌గా నడిచింది. హిందీ, తెలుగు భాషల్లో ఈ సినిమా అసాధారణ విజయం సాధించింది. ఈ మూవీ దెబ్బకు ‘హరి హర వీరమల్లు(MMVM)’, ‘వార్ 2’, ‘కూలీ(Coolie)’ వంటి స్టార్ హీరోల సినిమాలు విడుదలైనా, ‘మహావతార్ నరసింహ’ కంటెంట్ బలంతో వసూళ్లలో ముందంజలో నిలిచింది.

Mahavatar Narsimha Box Office Collection Day 10 (2nd Sunday)

యానిమేషన్ పరిశ్రమకు కొత్త ఊపిరి

మొదటి రోజు రూ.2.3 కోట్లతో ప్రారంభమైన ఈ చిత్రం, 30 రోజుల్లో రూ.291.45 కోట్లు, తాజాగా రూ.300 కోట్ల మార్కును అధిగమించింది. ఇది ‘సూర్యవంశీ’ (రూ.300 కోట్లు), ‘ది కేరళ స్టోరీ’ (రూ.304 కోట్లు) వంటి బాలీవుడ్(Bollywood) హిట్‌లను సైతం దాటేసింది.ఈ విజయం భారతీయ యానిమేషన్ పరిశ్రమకు కొత్త ఊపిరి పోసింది. ఈ చిత్రం ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’లో మొదటి భాగంగా, మిగిలిన ఆరు అవతారాల కథలను కూడా తెరకెక్కించనుంది. ఫుల్ రన్‌లో రూ.350 కోట్లు రాబట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *