మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) నటిస్తున్న సినిమాల్లో ఒకటి వార్-2 (War-2). ఈ మూవీతోనే ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ సినిమాను డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు. భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ అప్డేట్ ఇప్పుడు నెట్టింట వైరల్అవుతోంది. వార్-2 సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్, హృతిక్ కోసం ఇద్దరు స్టార్ హీరోలు రంగంలోకి దిగుతున్నారట.
ఆ ఇద్దరి కోసం ఈ ఇద్దరు
ఈ ఇద్దరు స్టార్లు ఈ సినిమాలో ప్రధాన పాత్రలను పరిచయం చేసేందుకు తమ గొంతు ఇవ్వనున్నారట. తెలుగులో వార్-2 సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh babu) ముందుకొచ్చారట. ఇక హిందీలో ఈ పాత్రలను స్టార్ నటుడు రణ్ బీర్ కపూర్ (Ranbir Kapoor) పరిచయం చేయనున్నాడట. మహేశ్ బాబు ఇప్పటికే చాలా సినిమాలకు తన వాయిస్ ను ఇచ్చిన విషయం తెలిసిందే. జల్సా సినిమాలో హీరో పాత్రను పరిచయం చేసిన ఆయన.. రీసెంట్ గా ముఫాసా లయన్ కింగ్ సినిమాకు కూడా తన గాత్రాన్ని అందించారు.
ఎన్టీఆర్ నెగిటివ్ రోల్
వార్ సినిమాకు సీక్వెల్ గా వార్-2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వార్ మూవీలో టైగర్ ష్రాఫ్, హృతిక్ రోషన్ (Hrithik Roshan) నటించగా.. ఇప్పుడు సీక్వెల్ లో హృతిక్ తో పాటు ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఇందులో హృతిక్ రోషన్ పాత్రకు ధీటుగా ఎన్టీఆర్ పాత్ర ఉంటుందని తెలుస్తోంది. అయితే ఆయన పాత్ర మొదట పాజిటివ్ గా ఉండి.. చివరకు నెగిటివ్ రోల్ అవుతుందని సమాచారం. వార్2 షూటింగ్ పూర్తయ్యాక ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ (వర్కింగ్ టైటిల్) సినిమాను చేయనున్నాడు.






