టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం అందుకునే స్టార్ హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) కూడా ఒకరు. ఆయన ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఇవాళ హైదరాబాద్ లో పూజ కార్యక్రమం జరిగినట్లు తెలిసింది. అయితే ఈ మూవీకి సంబంధించి తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటంటే..
బాబు ఓకే అంటే రూ.250 కోట్లు
SSMB29 వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాను దాదాపు రూ.వేయి కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మహేశ్ బాబు ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని సమాచారం. జక్కన్న (SS Rajamouli) మూవీతో మహేశ్.. పాన్ వరల్డ్ మార్కెట్లో అడుగుపెడుతున్నారు. దాదాపు మూడేళ్లు ఈ సినిమా కోసమే ఆయన తన సమయం కేటాయించనున్నారట. బాబు డిమాండ్ చేస్తే నిర్మాతలు రూ.250 కోట్లకు పైగా పారితోషికం ఇచ్చేందుకు రెడీగా ఉంటారు. కానీ మహేశ్ మాత్రం తనకు ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దన్నారట.
లాభాల్లో వాటా
రూ.వేయి కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నందున.. నిర్మాత నుంచి తాను రెమ్యునరేషన్ తీసుకోవడం కరెక్టు కాదని మహేశ్ బాబు (SSMB29 Mahesh Babu Remuneration) భావిస్తున్నట్లు సమాచారం. అయితే పారితోషికం తీసుకోకుండా.. సినిమా లాభాలాల్లో వాటా తీసుకోవడానికి అంగీకరించినట్లు టాక్. దుర్గా ఆర్ట్స్ పతాకంపై నిర్మాత కె.ఎల్ నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో మహేశ్ బాబు, రాజమౌళి ఇద్దరూ చెరో 25 శాతం వాటా ఇచ్చేలా ఒప్పందం జరిగినట్లు ఫిలింనగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
రెండు భాగాలుగా సినిమా
మరోవైపు ఈ సినిమాను (SSMB29 Release Date) రెండు భాగాలుగా విడుదల చేయాలని రాజమౌళి భావిస్తున్నారట. 2027లో ఫస్ట్ పార్ట్, 2029లో రెండో భాగం రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా నటించనున్నట్లు టాక్. ఇక ఈ చిత్రంలో విలన్ రోల్ మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ సందడి చేయనున్నట్లు తెలిసింది.






