దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి(Rajamouli), సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) కాంబినేషన్‌లో ఓ భారీ యాక్షన్ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం SSMB29 వర్కింగ్ టైటిల్(Working Title)తో ఈ మూవీ షూటింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ బిగ్ కాంబోపై వరల్డ్ వైడ్‌గా ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే జక్కన్న తెరకెక్కించిన ‘RRR’ మన ఇండియన్ సినిమా దగ్గర ఒక కొత్త విజువల్ ట్రీట్(Visual treat)ని అందించింది. ఇక ఇదే అనుకుంటే దీనికి మించిన ట్రీట్ మహేశ్‌తో తీస్తున్న సినిమాకి రాజమౌళి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా..
ఈ నేపథ్యంలో వరల్డ్ వైడ్(World Wide)గా తమ సినిమా కోసం మరోసారి మాట్లాడుకునే రేంజ్‌లో ఔట్‌పుట్‌ని జక్కన్న ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా హై టెక్నికల్, క్వాలిటీ(Quality)తో వరల్డ్ షేక్ అయ్యేలా ఈ సినిమా విజువల్స్ ఉంటాయని ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. ఇందుకోసం మహేశ్ బాబు, ప్రియాంకా చోప్రా(Priyanka Chopra) ఇంట్రడక్షన్ సీన్‌ను కూడా రాజమౌళి ప్లాన్ చేశారట. ఇందుకోసం తదుపరి షూట్‌ను కెన్యా(Kenya) అడవుల్లో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

భారీ యాక్షన్ ఎలిమెంట్స్..
అంతేకాదు, ఈ సీన్లో భారీ యాక్షన్ ఎలిమెంట్స్(Heavy action elements) ఉండబోతున్నాయట. కెన్యా లొకేషన్లు, ఫారెస్ట్ నేపథ్యం సినిమాకు స్పెషల్ విజువల్ ట్రీట్(Special visual treat) ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఈ సీన్ కోసం భారీ VFX టీమ్, ఇంటర్నేషనల్ టెక్నికల్ సిబ్బంది పనిచేస్తున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే మరోసారి ఆస్కార్(Oscar) వేదికపై రాజమౌళి సినిమాను చూడటం పక్కా అని అభిమానులు(Fans) అంటున్నారు.
Yes Yes… Eroju kuda oka pic release chesaru…#SSMB29 #MaheshBabu & #PriyankaChopra pic.twitter.com/sYJy9oqMTQ
— Jon Snow (@Wardenof_north) June 28, 2025






