సోనూసూద్ (Sonu Sood).. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. రీల్ లైఫ్ లో విలన్ గా నటించి మెప్పించిన ఈ నటుడు కరోనా సమయంలో చేసిన సాయాన్ని చూసి రియల్ లైఫ్ హీరో ట్యాగ్ ఇచ్చేశారు నెటిజన్లు. ఇక సోనూ సూద్ హిందీతో పాటు, తెలుగులోనూ నటుడిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మహేశ్ బాబు (Mahesh Babu) నటించిన ‘దూకుడు’ చిత్రంలో సోనూ నటనకు మంచి మార్కులు పడ్డాయి.
ఫతేహ్ ట్రైలర్ రిలీజ్
ఇక బాలీవుడ్ లో వరుస సినిమాలతో సోనూ దూసుకెళ్తున్నాడు. తాజాగా సోనూ సూద్ మెగాఫోన్ పట్టాడు. తాను స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఫతేహ్’ (Fateh). జాక్వెలెన్ ఫెర్నాండెజ్ కథానాయికగా నటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జనవరి 10వ తేదీన సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్ (Fateh Trailer) రిలీజ్ అయింది. ఈ ట్రైలర్‌ను సూపర్ స్టార్ మహేశ్ బాబు విడుదల చేశారు. ఫతేహ్ చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలియజేశారు. పూర్తి స్థాయి యాక్షన్ కథతో ఈ సినిమాను రూపొందినట్టు ప్రచారం చిత్రం చూస్తే అర్థమవుతోంది. మరి మీరు కూడా ఫతేహ్ ట్రైలర్ చూసేయండి.






