స్టార్ హీరోలు ధరించే చొక్కాలు, వాటి ధరలు తెలుసుకోవడంలో ఆడియన్స్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపుతుంటారు. మరీ ముఖ్యంగా హీరోహీరోయిన్లు ఏదైనా ఫంక్షన్స్ వెళ్లినప్పుడు ధరించే దుస్తుల ధరల గురించి తెలుసుకునేందుకు ట్రై చేస్తుంటారు. తాజాగా అక్కినేని అఖిల్ గ్రాండ్ వెడ్డింగ్ వేడుకలో మహేష్ బాబు ధరించిన టీ-షర్ట్ గురించి సోషల్ మీడియాలో తెగ చర్చలు నడుస్తున్నాయి.
అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు, టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని ఇటీవలే జైనబ్ రవ్జీతో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు. జూన్ 8వ తేదీ హైదరాబాద్‌లోని అక్కినేని స్టూడియోస్‌లో గ్రాండ్ రిసెప్షన్ జరిగింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అఖిల్-జైనాబ్ ల రిసెప్షన్ కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీతో ఈ ఈవెంట్ కి వచ్చారు. తన భార్య నమ్రతా శిరోద్కర్, కుమార్తె సితారలతో కలిసి రిసెప్షన్ అటెండ్ అయ్యారు.
అయితే అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్ లో మహేష్ బాబు ధరించిన దుస్తులపై అందరి చూపు పడింది. ఆయన వేసుకున్న టీ షర్ట్ సింపుల్ గానే కనిపిస్తూ అందరినీ అట్రాక్ట్ చేసింది. దీంతో ఈ టీ షర్ట్ ధర ఎంత అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దుస్తుల బ్రాండ్ ‘హెర్మ్స్’ నుండి వచ్చిన టీ-షర్ట్ అని, దీని ధర సుమారు 1.51 లక్షల రూపాయలని తెలుస్తోంది. ఇది తెలిసి అంతా షాకవుతున్నారు.
మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో ఓ భారీ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.






