
సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) నటించిన ఐకానిక్ చిత్రం ‘అతడు(Athadu)’ ఈరోజు (ఆగస్టు 9) ఆయన బర్త్ డే కానుకగా మరోసారి రీ-రిలీజ్(Re-release) అయింది. తెలుగు రాష్ట్రాల్లో పలు థియేటర్లలో ఇప్పటికే ప్రీమియర్స్ పడ్డాయి. ఈ సందర్భంగా థియేటర్లలో ప్రిన్స్ ఫ్యాన్స్ ఫుల్ సందడి చేస్తున్నారు. 2005లో త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రం, మహేశ్ బాబు కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచింది. జయభేరి ఆర్ట్స్(Jayabheri Arts) బ్యానర్‌పై నిర్మాత మురళీమోహన్(Murali Mohan) రూపొందించిన ‘అతడు’, అప్పట్లో థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా, టెలివిజన్‌లో రికార్డు టీఆర్పీ రేటింగ్‌లతో అభిమానుల మనసు గెలుచుకుంది. మహేశ్ బాబు స్టైలిష్ లుక్, త్రిష(Trisha)తో కెమిస్ట్రీ, త్రివిక్రమ్ సంభాషణలు, మణిశర్మ సంగీతం, బ్రహ్మానందం కామెడీ ఈ చిత్రాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశాయి.
మహేశ్, త్రివిక్రమ్ డేట్స్ ఇస్తే ‘అతడు’ సీక్వెల్
ఈ రీ-రిలీజ్ కోసం టెక్నాలజీ పరంగా మూవీని 4K వెర్షన్‌లోకి అప్డేట్ చేసినట్లు నిర్మాతలు తెలిపారు. ఈ మేరకు గత నెల 30న మహేశ్ బాబు యూట్యూబ్ ఛానల్లో రీ-రిలీజ్ ట్రైలర్ విడుదల చేయగా.. అభిమానుల్లో హైప్‌ను పెంచింది. ప్రపంచవ్యాప్తంగా 1000కి పైగా థియేటర్లలో ఈ చిత్రం విడుదల అయింది. ‘అతడు’లో మహేశ్ బాబు నటనకు నంది అవార్డు లభించింది. కాగా ఈ మూవీపై ఇటీవల నిర్మాత, నటుడు మురళీమోహన్ మాట్లాడుతూ, మహేశ్, త్రివిక్రమ్ డేట్స్ ఇస్తే ‘అతడు’ సీక్వెల్ తీసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఈ రీ-రిలీజ్‌తో మహేశ్ బాబు అభిమానులకు థియేటర్లలో మరోసారి సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు.
Industry ki okkadee babuu ……….. MAHESH BABU ❤️Jaii babuuuu ✊🏻🔥#HBDSuperstarMahesh #Athadu4K #MaheshBabu #MaheshBabu𓃵 #vishwanath #Athadu4KOnAug9th #AthaduReRelease pic.twitter.com/W815s9sGvN
— bhAAi 😎🗡️ (@BharatAllu) August 8, 2025