Mana Enadu : బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్ (Shilpa Shirodkar) అంటే తెలుగు వారికి తెలియదేమో కానీ.. సూపర్ స్టార్ మహేశ్ బాబు మరదలు, నమ్రతా శిరోద్కర్ (Namrata Shirodkar ) సోదరి అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న హిందీ రియాలిటీ షో బిగ్ బాస్ 18 (Bigg Boss 18)లోకంటెస్టెంట్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమె ఓ ప్రముఖ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో మహేశ్-నమ్రతలతో తనకున్న అనుబంధం గురించి షేర్ చేసుకుంది శిల్పా.
మహేశ్ సూపర్ స్టారే కాదు
శిల్పా శిరోద్కర్ మహేశ్ బాబు (Mahesh Babu) భార్య నమ్రతా శిరోద్కర్ సోదరి. సూపర్ స్టార్ మహేశ్ బాబుకు మరదలు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శిల్పా మాట్లాడుతూ.. మహేశ్ బాబు ఒక ఫ్యామిలీ మెంబర్ మాత్రమేనని స్టార్ హీరోలా ఉండరని, తాము కూడా అలా ఫీల్ అవ్వమని చెపపారు. నమ్రత కంటే ఎక్కువగా మహేశ్ బాబే తమకు హెల్ప్ చేస్తుంటారని. అన్నారు. తమ పేరెంట్స్ చనిపోయాక కుటుంబ బాధ్యతలన్నీ నమ్రతానే తీసుకుందని.. ఆమె తమకు ఒక పిల్లర్ లాంటిదని చెప్పుకొచ్చారు.
బిగ్ బాస్ హౌసులోకి మహేశ్ మరదలు
బిగ్ బాస్ 18లో శిల్పా శిరోద్కర్ ఎంట్రీపై తాజాగా ఓ ప్రోమో (Shilpa Shirodkar Bigg Boss Promo) రిలీజ్ అయింది. సల్మాన్ ఖాన్‌తో కలిసి పార్టిసిపేట్ చేయడమనే కల ఇప్పుడు నెరవేరబోతుందంటూ ఒక మిస్టీరియస్ వాయీస్గా ఆమెను పరిచయం చేయడం ఈ వీడియోలో చూడొచ్చు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
బిగ్ బాస్ లోకి శిల్పా శిరోద్కర్
ఇక తాజా ప్రోమోలో “నన్ను ప్రేక్షకులంతా 90’s రాణి అని పిలుస్తుంటారు. నేను అప్పటి పెద్ద హీరోలందరితో కలిసి పనిచేశాను. అమితాబ్ బచ్చన్, మిథున్ చక్రవర్తి, గోవిందా, అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్ లాంటి వాళ్లందరితో యాక్ట్ చేశాను. సల్మాన్ ఖాన్ (Salman Khan)తో పని చేయాలనే కల ఇప్పటికి నెరవేరుతుంది” అంటూ వాయిస్ ఓవర్ వినొచ్చు. ఈ వీడియోలో ఆమె ముఖం కనిపించకపోయినా నెటిజన్లు మాత్రం ఇది శిల్పా శిరోద్కరే అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.






