వెస్టిండీస్(West Indies)తో జరిగిన మూడో టీ20లో ఆస్ట్రేలియా(Australia) మిడిల్ ఆర్డర్ బ్యాటర్ టిమ్ డేవిడ్ (Tim David) అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. దీంతో సెంట్ కిట్స్(St Kitts)లోని వార్నర్ పార్క్‌లో జరిగిన ఈ మ్యాచులో ఆసీస్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 215 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్‌గా వచ్చిన మ్యాక్స్ వెల్ (20) రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. మరో ఎండ్‌లో మార్ష్ (22), ఇంగ్లిష్ (15) సైతం తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు.
6 ఫోర్లు, 11 సిక్సర్లతో సునామీ ఇన్నింగ్స్
ఆ తర్వాత ఆల్ రౌండర్ గ్రీన్ (11) సైతం నిరాశపర్చాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన డెవిడ్(David) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 37 బంతుల్లో 6 ఫోర్లు, 11 సిక్సర్లతో సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. అతడికి మిచెల్ ఓపెన్ (36*) సహకారం అందించడంతో ఆసీస్ 4 వికెట్లు కోల్పోయి మరో 23 బంతులు మిగిలి ఉండగానే 215 రన్స్ చేసి ఘన విజయం సాధించింది. విండీస్ బౌలర్లలో షఫర్డ్ 2 వికెట్లు పడగొట్టగా, హోల్డర్ ఒకవ వికెట్ తీశాడు. కాగా ఈ విజయంతో ఆసీస్ ఐదు మ్యాచుల T20 సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది.
Fastest century for Australia
3rd fastest in T20I historyTim David, the Goliath of this format 🦁
— 𝘿 (@Vk18xCr7) July 26, 2025
కెప్టెన్ హోప్ సెంచరీ వృథా
అంతకుముందు విండీస్ ఓపెనర్లు బ్రెండన్ కింగ్ (36 బంతుల్లో 62)కు తోడు కెప్టెన్ షై హోప్(102*) సూపర్ చెంరీతో 214 పరుగుల భారీ స్కోరు సాధించింది. హోప్ కేవలం 57 బంతుల్లో 6 సిక్సర్లు, 8 ఫోర్లతో సూపర్ సెంచరీ సాధించాడు. అయితే వీరిద్దరూ అవుట్ కాగా.. క్రీజులోకి వచ్చిన హెట్‌మయర్ (9), రూథర్ ఫర్డ్ (12), పావెల్ (9), షఫర్డ్ (9*) నిరాశపర్చారు. ఆసీస్ బౌలర్లలో ఎల్లీస్, జంపా, ఓవెన్ తలో వికెట్ తీశారు. ఆస్ట్రేలియా తరఫున అత్యంత వేగవంతమైన T20I సెంచరీ నమోదు చేసిన డేవిడ్‌కు “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు దక్కింది.






