ఇంగ్లండ్ మహిళల(England Women) జట్టుతో జరుగుతున్న తొలి టీ20లో టీమ్ఇండియా(Team India) ఉమెన్ కెప్టెన్ స్మృతి మంధాన(Smriti Mandhana) సెంచరీతో చెలరేగింది. నాటింగ్‌హమ్‌లోని బ్రిడ్జ్ టౌన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 210/5 పరుగుల భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్‌కు ఓపెనర్లు షెఫాలీ (20), మంధాన (112) తొలి వికెట్‌కు 8.3 ఓవర్లలోనే 77 పరుగుల భాగస్వామ్యం అందించారు. షెఫాలీ (Shefali) ఔట్ అయ్యాక వచ్చిన హర్లీన్ డియోల్ (43)తో సాయంతో మంధాన మెరుపులు మెరిపించింది. ఈ క్రమంలో టీ20ల్లో తొలి సెంచరీని పూర్తి చేసుకుంది. మంధాన కేవలం 51 బంతుల్లో 3 సిక్సర్లు, 15 ఫోర్ల సాయంతో శతకం(Century) పూర్తి చేసింది.
🚨 THE MOMENT! 🚨
– Smriti Mandhana scripts history — becomes the first Indian woman to score centuries in all three formats of international cricket! 🙇♀️🇮🇳
A proud moment for Indian cricket — the elegance, the dominance, the legacy. 💫#SmritiMandhana pic.twitter.com/RIva414Zh3
— Akaran.A (@Akaran_1) June 28, 2025
అంతకుముందు రిచా ఘోష్ (12), రోడ్రిగ్స్ (0)నిరాశపర్చారు. కౌర్ (3*), దీప్తి (7*) రన్స్ చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెల్ 3, అర్లోట్, ఎకిల్‌స్టోన్ చెరో వికెట్ తీశారు. కాగా ఇప్పటి వరకూ మంధాన మొత్తం 149 ఇంటర్నేషనల్ T20 మ్యాచులు ఆడి మొత్తం 3,878 రన్స్ చేసింది. ఇందులో 30 హాఫ్ సెంచరీలు ఉండగా.. ఈరోజు తొలి శతకాన్ని నమోదు చేసింది. కాగా ఇంగ్లండ్‌తో మ్యాచులో గెలవాలంటే 20 ఓవర్లలో 211 రన్స్ చేయాలి.






