ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమాలో మాలీవుడ్ స్టార్

‘దేవర'(Devara)తో సూపర్ హిట్ కొట్టిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన తదుపరి ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టాడు. అయితే ఎన్టీఆర్ తన తర్వాతి సినిమా కేజీయఫ్, సలార్ (Salar) వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్31 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి గతంలోనే అధికారిక ప్రకటన విడుదల చేశారు. కానీ అప్పట్నుంచి ఈ చిత్రానికి సంబంధించి అప్డేట్స్ ఏం రాలేదు.

ఎన్టీఆర్-నీల్ మూవీ అప్డేట్

అయితే తాజాగా ఎన్టీఆర్, నీల్ సినిమా గురించి ఓ అప్డేట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఇప్పటికే సలార్ సినిమాతో మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ని తెలుగు తెరపైకి తీసుకొచ్చిన ప్రశాంత్‌ నీల్‌ (Prashant  Neel).. ఇప్పుడు ఎన్టీఆర్ మూవీతో మరో మాలీవుడ్ నటుడిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాలని అనుకుంటున్నాడట. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు అంటే..?

 

 

ఎన్టీఆర్ మూవీలో సూపర్ హీరో

మిన్నల్ మురళి, 2018, ఎఆర్ఎమ్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు మాలీవుడ్ నటుడు  టొవినో థామస్‌ (Tovino Thomas). ఇప్పుడు ఎన్టీఆర్‌ (NTR) సినిమాతో టొవినో థామస్ డైరెక్టుగా తెలుగు సినిమా చేసేందుకు రెడీ అయ్యాడట. ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న NTR31 చిత్రంలో ఈ స్టార్ నటుడు ఓ పాత్రలో నటించనున్నట్లు సమాచారం. అయితే ఎలాంటి పాత్రలో కనిపిస్తాడో మాత్రం తెలియదు. దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఫొటో వైరల్

ప్రశాంత్ నీల్, టొవినో థామస్ లు కలిసి దిగిన ఫొటో ఒకటి ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సినిమా కోసమే నీల్ టొవినో థామస్ ను కలిశాడనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ సినిమా సంగతికి వస్తే మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో ఎన్టీఆర్‌ సరసన కన్నడ భామ రుక్మిణీ వసంత్‌ (Rukmini Vasant) నటిస్తోంది. పీరియాడిక్‌ కథతో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *