Mana Enadu : మాల్దీవుల అధ్యక్షుడు (Maldives President) మొహమ్మద్ ముయిజ్జు భారత్ లో పర్యటిస్తున్నారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం మధ్యాహ్నం ఆయన దిల్లీ చేరుకున్నారు. మాల్దీవుల ప్రథమ మహిళ సాజిదా మొహమ్మద్ (Sajidha Mohamed)తో కలిసి ఆయన ఇండియాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఇవాళ రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు.
రాజ్‌ఘాట్‌లో ముయిజ్జు
ఈ సందర్భంగా మాల్దీవుల అధ్యక్షుడికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సాదర స్వాగతం పలికారు. అనంతరం భార్య సాజిదాతో కలిసి రాజ్‌ఘాట్‌లో (Rajghat) ముయిజ్జు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. భారత టూరిస్టు(Indian Tourists)లకు మాల్దీవుల అధ్యక్షుడు ఓ రిక్వెస్ట్ చేశారు.
మాల్దీవుల్లో పర్యటించండి ప్లీజ్
భారత టూరిస్టులు తమ దేశంలో పర్యటించాలని మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు(mohamed muizzu) ఆహ్వానించారు. వారు తమ ఆర్థికవ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతున్నారని అన్నారు. ముయిజ్జు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆ ప్రభుత్వ మంత్రులు చేసిన వ్యాఖ్యలతో భారత్-మాల్దీవుల సంబంధాలు ఒడుదొడుకులకు లోనైన విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే ఆయన నుంచి ఈ స్పందన వచ్చింది.
#WATCH | Maldives President Mohamed Muizzu lays a wreath at Rajghat, in Delhi. His wife Sajidha Mohamed is also with him.
(Video: ANI/DD News) pic.twitter.com/sZoU4lYUSW
— ANI (@ANI) October 7, 2024
భారత్ లో ముయిజ్జు పర్యటన
కాగా, నాలుగు నెలల్లో ముయిజ్జు భారత్ (mohamed muizzu India Tour)కు రావడం ఇది రెండోసారి. అయితే తొలి ద్వైపాక్షిక పర్యటన మాత్రం ఇదే కావడం గమనార్హం. జూన్‌లో జరిగిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇప్పుడు భారత్‌కు వచ్చారు.
#WATCH | President Droupadi Murmu and Maldives President Mohamed Muizzu introduce each other to their respective country’s ministers and delegation at the Rashtrapati Bhavan, in Delhi.
(Video: DD News) pic.twitter.com/mUwGzLKldN
— ANI (@ANI) October 7, 2024
అక్టోబర్ 10 దాకా ఆయన భారత్‌లోనే పర్యటించనున్నారు. ఈ పర్యటనలో రాష్ట్రపతి, ప్రధానితో ఆయన భేటీ కానున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలకు తోడు ఇరు దేశాలకూ ప్రయోజనకరమైన అంతర్జాతీయ అంశాలపై వీరి మధ్య చర్చలు జరుగుతాయని వెల్లడించింది.