అవినీతి, మతపరమైన ఆరోపణలు.. పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎంపై కాల్పులు

Mana Enadu : పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్ బీర్ సింగ్ బాదల్ (Sukhbir Singh Badal )పై కాల్పులు జరిగాయి. అధికారంలో ఉన్న సమయంలో ఆయన అనేక అవినీతి, మతపరమైన ఆరోపణలు ఎదుర్కొన్నారు. 2007-17 మధ్య కాలంలో పార్టీతోపాటు వారి ప్రభుత్వం రాజకీయంగా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్లు అకాల్ తఖ్ నిర్ధారించి సుఖ్ బీర్ ను దోషి అని తేల్చింది. అతడికి శిక్ష కూడా వేసింది.

అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయంలో (Golden Temple) క్లీనింగ్ పనులు చేయాలని ఆదేశించింది. శిరోమణి అకాలీదళ్ పార్టీ చీఫ్ గా ఉన్న ఆయన రాజీనామాను ఆమోదించి.. ఆరు నెలల్లోగా పార్టీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని సూచిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన మంగళవారం నుంచి ఈ శిక్షను అనుభవిస్తున్నారు. చేసిన తప్పులను అంగీకరిస్తున్నట్లు రాసి ఉన్న చిన్న బోర్డును మెడలో వేసుకుని, చేతిలో ఈటెను పట్టుకుని పనులు చేస్తున్నారు.

దగ్గరగా వచ్చి కాల్చిన వృద్ధుడు

ప్రఖ్యాత స్వర్ణ దేవాలయంలో పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ పార్టీ నేత సుఖ్ బీర్ సింగ్ బాదల్ (Fire at Sukhbir Singh Badal)పై వృద్ధుడు కాల్పులకు తెగబడటం సంచలనం రేకెత్తిస్తోంది. ఆయన సేవాదార్గా శిక్ష అనుభవిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందులో ఆయనను తన చుట్టూ ఉన్న కొంతమంది సేవా రక్షకులు ఆయన్ని కాపాడారు.

వృద్ధుడు జేబులోంచి తుపాకీ తీసి దగ్గరగా వచ్చి కాల్పులు జరపగా.. పక్కనే ఉన్న వ్యక్తి కాపాడటంతో త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ కాల్పుల్లో బుల్లెట్లు పైకి పేలడంతో అక్కడున్నవారు భయంతో పక్కకు పరుగులు తీశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

గోల్డెన్ టెంపుల్ ప్రవేశద్వారం వద్ద ఘటన

స్వర్ణ దేవాలయ ప్రవేశ ద్వారం వద్ద సుఖ్ బీర్ చక్రాల కుర్చీపై కూర్చొని కాపలాదారుడిగా పనిచేస్తున్నారు. కాగా దగ్గరగా కాల్పులు జరపడంతో అందరూ బీతిల్లిపోయారు. వెంటనే తేరుకున్న అతడి భద్రతా సిబ్బంది (Security personnel) సుఖ్ బీర్ సింగ్ ను కాపాడారు. కాల్పులు జరిపిన వృద్ధుడిని పోలీసులకు అప్పగించారు.

నిందితుడిని నారైన్ సింగ్ చౌరాగా గుర్తించారు. నిందితుడు గతంలో బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ అనే ఉగ్రముఠాలో పనిచేసినట్లు పలు ఆంగ్ల మీడియాల్లో కథనాలు (English media articles) ప్రసారం అవుతున్నాయి. ఇప్పటికే చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తిని కాల్చాలనుకోవడం దారుణమని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *