Manchu Family: మంచు మనోజ్ శరీరంపై గాయాలు.. మెడికో లీగల్ రిపోర్టు వైరల్!

మంచు ఫ్యామిలీ(Manchu Family) వివాదం ముదురుతోంది. తాజాగా మంచు మనోజ్‌ ఇంటి CC ఫుటేజ్ హార్డ్ డిస్క్(Haed Disk) తీసుకెళ్లారు విష్ణు అనుచరులు(Followers of Vishnu). జల్ పల్లి(Jalpally) లో ఉంటున్న మంచు మనోజ్(Manchu Manoj) ఇంటికి విష్ణు వ్యాపార భాగస్వామి విజయ్(Vijay) వచ్చారు. ఈ తరుణంలోనే మంచు మనోజ్ ఇంటి సీసీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ తీసుకెళ్లారు విజయ్. మరోవైపు మంచు మనోజ్ ఇంటి చుట్టూ విష్ణు మనుషులు, ప్రైవేట్ బౌన్సర్ల(Private bouncers)తో కాపలా కాస్తున్నారు. దుబాయ్(Dubai) నుంచి వచ్చిన మంచు విష్ణు కాసేపట్లో మనోజ్‌ ఇంటికి వెళ్లనున్నారు.

భార్యతో కలిసి ఆస్పత్రికి మనోజ్

ఇదిలా ఉండగా తాజాగా మంచు మనోజ్ శరీరంపై గాయాలున్నట్లు మెడికో లీగల్ రిపోర్టు(Medico Legal Report)లో వెల్లడైంది. కడుపు, వెన్నెముక, ఎడమ కాలి పిక్క భాగంలో దెబ్బలు తగిలాయని, మెడ(Neck)పై గోళ్లతో రక్కిన ఆనవాళ్లున్నాయని తేలింది. కుటుంబ వివాదాల నేపథ్యంలో మనోజ్‌పై దాడి జరిగినట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. నిన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి భార్యతో కలిసి వచ్చిన ఆయన చికిత్స అనంతరం వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన మెడికల్ రిపోర్టు(Medical) ఇవాళ బయటకు వచ్చింది.

మోహన్‌బాబు వర్సెస్ మనోజ్?

కాగా ఆదివారం టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీ అంతా షాక్‌కి గురైంది. మంచు ఫ్యామిలీలో ఎన్నడూ లేని విధంగా ఓ షాకింగ్ ఘటన టాలీవుడ్‌ని షేక్ చేసింది. మంచు మోహన్ బాబు, చిన్న కుమారుడు మంచు మనోజ్‌ల మధ్య దాడి జరిగిందని, ఈ దాడిలో మోహన్ బాబు తన అనుచరులతో మనోజ్‌పై దాడి చేయించారనేలా వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఆ కాసేపటికే మంచు మోహన్ బాబు(Manchu Mohan babu) ఫ్యామిలీ తరపు నుంచి ఆ వార్తలలో ఎటువంటి నిజం లేదనేలా ఓ వార్త వచ్చింది. కానీ, మంచు మనోజ్ మాత్రం తనపై తన తండ్రి దాడి చేయించినట్లుగా మీడియా(Media) ముందు ప్రకటించాడు. తనపై దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేయబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *