టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీ వివాదం (Manchu Family Controversy) రోజురోజుకు ముదురుతోంది. కాస్త సర్దుకుందని అనుకునే లోపే మళ్లీ ఇటీవల మంచు మనోజ్ తిరుపతి పర్యటన మళ్లీ వేడి రాజేసింది. ఎంబీయూ వద్ద ఆయన చేసిన రచ్చ ఈ గొడవకు మరింత ఆజ్యం పోసినట్లయింది. ఇక తాజాగా సోషల్ మీడియాలో మంచు విష్ణు, మంచు మనోజ్ ట్వీట్ వార్ మొదలైంది. ఒకరిపై మరొకరు ఇండైరెక్ట్ ట్వీట్స్ చేసుకుంటూ నెట్టింట రచ్చ చేశారు.
వచ్చే జన్మలో అయినా తెలుసుకుంటావ్
‘‘నా ఫేవరెట్ మూవీ.. అందులోని డైలాగ్’’ అంటూ విష్ణు ఈరోజు మధ్యాహ్నం ఆడియో క్లిప్ షేర్ చేశాడు. తాను, తన తండ్రి మోహన్‌బాబుతో కలిసి ఆర్జీవీ తెరకెక్కించిన ‘రౌడీ (Rowdy)’ చిత్రంలోని ‘‘సింహం అవ్వాలని ప్రతి కుక్కకీ ఉంటుంది. కానీ, వీధిలో మొరగడానికి, అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలో అయినా తెలుసుకుంటావన్న ఆశ’’ అనే డైలాగ్ ఉన్న వీడియోను విష్ణు (Manchu Vishnu) ఎక్స్ లో షేర్ చేశారు.
One of my fav movie and dialogue from #Rowdy. @RGVzoomin is one of my fav and he rocked this movie. Every dialogue in this is a statement. Celebrating #MB50 pic.twitter.com/AZToFJ1eKM
— Vishnu Manchu (@iVishnuManchu) January 17, 2025
ఈ జన్మలో తెలుసుకుంటావ్
ఇక మంచు విష్ణు పోస్టు పెట్టిన మరికొన్ని గంటల్లోనే కృష్ణంరాజు నటించిన తాండ్రపాపారాయుడు, భక్తకన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న పోస్టర్లను పంచుకుంటూ మనోజ్ (Manchu Manoj) మరో పోస్టు షేర్ చేశారు. ‘‘భక్త కన్నప్ప’లో కృష్ణం రాజులాగా.. సింహం అవ్వాలని ప్రతి కుక్కకీ ఉంటుంది. ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావ్’’ అని ఆయన తన పోస్టులో క్యాప్షన్ ఇచ్చారు. దీనికి #VisMith అనే హ్యాష్‌ట్యాగ్ కూడా యాడ్ చేసి.. అతడి హాలీవుడ్ ప్రాజెక్టు అనేది క్లూ అంటూ పేర్కొన్నారు.
#VisMith (crack this guys)
Clue (his Hollywood venture) pic.twitter.com/UpNougHLJT— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) January 17, 2025
ఎక్స్ లో ట్వీట్ వార్
గత కొన్ని రోజులుగా మంచు కుటుంబంలో మంటలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకునే వరకూ పరిస్థితులు దారి తీశాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఎక్స్ వేదికగా అటు విష్ణు, ఇటు మనోజ్ పెట్టిన పోస్టులు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ పోస్టులు చూసి కొందరు మనోజ్ కు మద్దతుగా నిలుస్తుంటే.. మరికొందరు విష్ణుకు సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఈ మంచు ఫ్యామిలీ గొడవ ఎక్కడి వరకు దారి తీస్తుందోనని పలువురు నెటిజన్లు అంటున్నారు.






