
మంచు విష్ణు(Manch Vishnu) నటిస్తున్న హిస్టారికల్ చిత్రం కన్నప్ప(Kannappa). డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh) తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ప్రభాస్(Prabhas), అక్షయ్ కుమార్, మోహన్ లాల్(Mohan lal), మోహన్ బాబు(Mohan Babu), ప్రీతి ముకుందన్, కాజల్ అగర్వాల్, నయనతార(Nayanatara), అసితా అనోలా రోడ్రిగ్స్ తదితర స్టార్ నటీనటులు నటించారు. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మంచు విష్ణు కుమారుడు అవ్రామ్(Avram Manchu) సినీఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రంలో విష్ణు పోషిస్తున్న చిన్నప్పుడు తిన్నడి(Tinnadu) పాత్రలో అవ్రామ్ కనిపించనున్నాడు. ఈ సందర్భంగా విష్ణు తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన చేశారు.
మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది..
‘‘కన్నప్ప’ సినిమాతో నా కుమారుడు అవ్రామ్(Avram) నటుడిగా పరిచయం అవుతున్నాడు. వాడు సినిమా సెట్‌లోకి అడుగుపెట్టిన క్షణం, కెమెరా ముందు నిలబడిన తీరు, సంభాషణలు పలికిన విధానం.. ఇవన్నీ నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని భావోద్వేగభరితమైన ఘట్టాలు. ఒక తండ్రిగా, ఒకప్పుడు నేను కలలుగన్న సినీ ప్రపంచంలోకి నా కుమారుడు అడుగుపెట్టడం చూస్తుంటే మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఇది కేవలం ఒక సినిమా ప్రవేశం మాత్రమే కాదు, జీవితాంతం గుర్తుండిపోయే ఒక మధురమైన జ్ఞాపకం’’ అని విష్ణు పేర్కొన్నారు. తనపై ప్రేక్షకులు చూపించిన ప్రేమాభిమానాలనే తన కుమారుడు అవ్రామ్‌పై కూడా చూపిస్తారని ఆశిస్తున్నట్లు విష్ణు తెలిపారు. కాగా ఈ పాన్ ఇండియా మూవీ ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
little Avram Manchu stood in front of 300 people and gave a performance that left everyone speechless
This isn’t just a cameo — it’s a glimpse into the bright future of the Manchu family. 💫
A star in the making. 🌟#AvramManchu #Kannappa #FutureStar #ManchuFamily #KannappaMaking… https://t.co/3Z2dN1oQ23— manchuvishnutrends (@manchuvishnufan) June 18, 2025