విష్ణు మంచు(Manchu Vishnu) నటించిన ‘కన్నప్ప(Kannappa)’ ఈ నెల 27న విడుదలై, బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకునే ప్రదర్శన కనబరుస్తోంది. డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh) దర్శకత్వంలో, మోహన్ బాబు(Mohan Babu) నిర్మించిన ఈ భక్తి ఇతిహాస చిత్రం, శివ భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా రూపొందింది. ఈ మూవీలో ప్రభాస్(Prabhas), అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, కాజల్ అగర్వాల్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించడంతో ఈ చిత్రం పాన్-ఇండియా రేంజ్‌లో ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా ఇప్పటికే అన్నిచోట్ల మూవీకి హిట్ టాక్(Hit Talk) రావడంతో కలెక్షన్ల(Collections) పరంగానూ దూసుకెళ్తోంది. రెండ్రోజుల కలెక్షన్లను మూవీ టీమ్ ప్రకటించింది.

‘కన్నప్ప’ భారతదేశంలో రూ. 16.5 కోట్ల నెట్ కలెక్షన్(Net Collections) సాధించిందని సాక్‌నిల్క్ నివేదించింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా రెండ్రోజుల్లో రూ. 42.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రంగా నిలిచింది. దీంతో విష్ణు మంచు కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్స్‌ను నమోదు చేసిన మూవీగా నిలిచింది. తెలుగు ప్రేక్షకుల నుండి 55.89% ఆక్యుపెన్సీ రేట్(Occupancy rate)తో భారీ ఆదరణ లభించగా, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ మంచి స్పందన వస్తోంది.
Kannappa Box Office: Manchu Vishnuâs Film Collects Rs 16.19 Crore in Two Days: Manchu Vishnu’s latest release Kannappa has set the cash counters on fire with heavy collections
Continue reading … https://t.co/MrkCqygwEt
— Netamaker (@netamakerIndia) June 29, 2025
కాగా రివ్యూల్లో ఫస్టాఫ్‌పై నెగటివ్ ఇంప్రెషన్ వచ్చినా.. సెకెండాఫ్, క్లైమాక్స్ సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సినిమా బడ్జెట్ రూ. 200 కోట్లుగా అంచనా వేయగా, ఇది రూ. 180 కోట్ల గ్రాస్ సాధిస్తే హిట్ స్టేటస్ పొందే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. విష్ణు మంచు తన నటనతో మెప్పించగా, ప్రభాస్, అక్షయ్ కుమార్ కామియోలు బాక్స్ ఆఫీస్ విజయంలో కీలక పాత్ర పోషించాయి. స్టీఫెన్ దేవస్సీ మ్యూజిక్ ఆకట్టుకుంది.






