మంచు విష్ణు(Manchu Vishnu) హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం “కన్నప్ప(Kannappa)”. మైథలాజికల్ డివోషనల్ జానర్‌లో రూపొందిన ఈ చిత్రం జూన్ 27న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన విషయం తెలిసిందే. శివభక్తుడైన కన్నప్ప చరిత్ర ఆధారంగా ముఖేష్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh) దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. మంచు మోహన్ బాబు(Mohan Babu) నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా ప్రభాస్(Prabhas), అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ వంటి స్టార్ కాస్ట్‌తో ఆకట్టుకుంది. థియేటర్లలో మిశ్రమ స్పందన పొందిన ఈ చిత్రం ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో విష్ణు నటన, విజువల్స్, BGMతో ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు “కన్నప్ప” ఓటీటీ రిలీజ్(Kannappa Ott Release) గురించి తాజా వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

థియేట్రికల్ రన్ పూర్తికాక ముందే..
మంచు విష్ణు స్వయంగా ఈ సినిమా ఓటీటీలో 10 వారాల వరకు విడుదల కాదని ప్రకటించారు. అంటే థియేట్రికల్ రన్(Theatrical run)ను పూర్తి చేసుకున్నాకే ఓటీటీలోకి వస్తుందని విష్ణు తెలిపారు. ఈ లెక్కన (ఆగస్టు 25న) డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి రావాల్సి ఉంది. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం జులై 25 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video)లో స్ట్రీమింగ్ కానుందని టాక్. ఈ మధ్యే కుబేర(Kubera) మూవీ కూడా నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చిన విషయం తెలిసిందే. నిజానికి ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించినా.. ఊహించిన దాని కంటే త్వరగానే OTTలోకి వచ్చింది. తాజాగా అదే బాటలో కన్నప్ప(Kannappa) కూడా ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.
🎬 #Kannappa to stream on Amazon Prime Video from July 25, 2025 – just a month after its theatrical release!
Vishnu Manchu had held OTT rights until post-release. Now, reports say a deal is done (awaiting official confirmation).
Starring #Prabhas #AkshayKumar #KajalAggarwal &… pic.twitter.com/NF3W33KCoV
— Suraj Choudhary (@bollywoodbroo) July 21, 2025






