Manchu Vishnu: ఎంతో బాధగా ఉంది.. ప్లీజ్ అలా చేయొద్దు: మంచు విష్ణు

మంచు విష్ణు (manchu Vishnu) ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘కన్నప్ప’ (Kannappa). ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా సక్సెస్ సాధించింది. ఈ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న విష్ణు.. మరో వైపు బాధతో ఉన్నారు. ఈ మూవీ పైరసీకి గురవుతోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైరసీని ప్రోత్సహించవద్దని విజ్ఞప్తి చేస్తూ తాజాగా ఎక్స్ వేదికగా పోస్ట్‌ పెట్టారు. ‘‘కన్నప్ప’ సినిమా పైరసీకి గురైంది. ఇప్పటికే 30వేల అనధికారిక లింక్‌లను మా టీమ్‌ తొలగించింది. ఈ విషయంలో ఎంతో బాధగా ఉంది. పైరసీ అనేది దొంగతనంతో సమానం. మన పిల్లలకు మనం దొంగతనం చేయమని నేర్పించం కదా.. ఇలా అనధికారికంగా సినిమా చూడడం కూడా దొంగతనంతో సమానమే. దయచేసి దీన్ని ప్రోత్సహించకండి. సరైన మార్గంలో ‘కన్నప్ప’ను ఆదరించండి’’ అని పోస్ట్‌ పెట్టారు.

ప్రభాస్‌ కారణంగానే ఇంత పెద్ద ఓపెనింగ్స్‌ వచ్చాయి

కన్నప్ప విజయం సాధించడంతో శనివారం సక్సెస్ మీట్ నిర్వహించగా విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ విజయం తన తండ్రికే దక్కుతుందన్నారు. ‘‘ఇది నాకెంతో భావోద్వేగభరితమైన సందర్భం. ఈ చిత్ర విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఈ విజయం పూర్తిగా మా నాన్నకే దక్కుతుంది. దీనికి ముందు నేను నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు. అయినా దేవుడిపై నమ్మకాన్ని నేనెప్పుడూ వదులుకోలేదు. నేనేంటో నా తండ్రి ముందు నిరూపించుకోవాలనుకున్నా. నా పేరు మీద ఉన్న ఆస్తులన్నీ బ్యాంక్‌లో తాకట్టు పెట్టి దీన్ని తీశాం. ట్రోలర్స్‌కు అవకాశమివ్వకుండా సినిమా చూపించగలగడం నిజంగా శివ లీలే. మేము ఎన్ని కప్పిపుచ్చాలన్నా కొన్ని తప్పులు ఉన్నాయి. కానీ, ఒకే కారణంతో ప్రేక్షకులు మమ్మల్ని మన్నించారు. చివరి అరగంట సినిమాలో లీనమైపోయారు. ప్రభాస్‌ (Prabhas) కారణంగానే మా సినిమాకి ఇంత పెద్ద ఓపెనింగ్స్‌ వచ్చాయి’ అని పేర్కొన్నారు. ఒక నటుడిగా తనకొక విజిటింగ్‌ కార్డు ఉంటే అదే ‘కన్నప్ప’ సినిమా అని అన్నారు.

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *