
ఏ ఇండస్ట్రీలోనైనా కామెడీ ఒరియెంటెడ్ సినిమాలకు ఫుల్ క్రేజ్ ఉంటుంది. కడుపుబ్బా నవ్వించే చిత్రాల(For funny pictures)కు ఫ్యాన్ బేస్ కూడా అంతే రేంజ్‌లో ఉంటుంది. అలాంటి సినిమాల్లో ఒకటి మంచు విష్ణు(Manchu Vishnu) నటించి ‘ఢీ(Dhee Movie)’. డైరెక్టర్ శ్రీనువైట్ల(Director Sreenu Vaitla) తెరకెక్కించిన ఈ మూవీ 2007 ఏప్రిల్ 13న థియేటర్లలోకి వచ్చింది. టాలీవుడ్ డైనమిక్ స్టార్ మంచు విష్ణు హీరోగా, జెనీలియా(Genelia) హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ అప్పట్లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.
విష్ణు కామెడీ టైమింగ్‌కు కాసుల వర్షం
ఈ మూవీలో దివంగత శ్రీహరి(Srihari) పాత్ర, బ్రహ్మానందం(Brahmanandam) కామెడీ, సునీల్(Sunil) ట్రాక్ ఆడియెన్స్‌ను ఎంతగా మెప్పించిందో స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ఈ చిత్రంలో విష్ణు కామెడీ టైమింగ్‌కు కాసుల వర్షం కురిసింది. మంచు విష్ణు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘ఢీ’ మూవీనీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. రేపు (జూన్ 6) రీ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందుకు ఓ రీజన్ కూడా ఉంది.. ప్రస్తుతం విష్ణు నటించిన ‘కన్నప్ప(Kannappa)’ ప్రమోషన్స్‌లో భాగంగా అభిమానులను ముందుగానే పలకరించాలనే ఉద్దేశంతో ‘ఢీ’ మూవీ రీరిలీజ్(Dhee Rerelease) చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘కన్నప్ప’ మూవీ జూన్ 27న విడుదల కానున్న విషయం తెలిసిందే.