మిస్టరీ థ్రిల్లర్‌‌కి స్క్రిప్ట్ రెడీ.. త్వరలోనే ‘మంగళవారం’ సీక్వెల్

RX100 ఫేమ్ పాయల్ రాజ్‌పుత్(Payal Rajput) ఫీమేల్ లీడ్ రోల్‌లో చేసిన మూవీ ‘మంగళవారం (Mangalavaram)’. 2003లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించిన మూవీల్లో ఒకటిగా నిలిచింది. సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్‌(psychological mystery thriller)గా ఈ మూవీని డైరెక్టర్ అజయ్ భూపతి(Director Ajay Bhupathi) తెరకెక్కించాడు.

నందిత శ్వేత, దివ్య పిళ్లై, అజ్మల్ అమీర్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య, అజయ్ ఘోష్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. కాగా ఈ సినిమా మేకర్స్ నుంచి మరో సూపర్ అప్డేట్ వచ్చింది. ఉద్వేగంతో కూడిన కథ, సస్పెన్స్, ట్విస్టులు, నేపథ్య సంగీతం, విజువల్స్ ఇప్పటికీ ఈ మూవీకి హైలైట్‌గా నిలిచాయి. తాజగా ఈ మూవీ సీక్వెల్‌(Sequel)పై డైరెక్టర్ ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు.

వీలైనంత త్వరలోనే షూటింగ్..?

మంగళవారం సినిమా తర్వాత డైరెక్టర్ అజయ్ భూపతి(Ajay Bhupathi) మరో సినిమా చేయలేదు. లేటెస్ట్‌గా మంగళవారం-2(Mangalavaram-2) గురించి ఆసక్తికర కబుర్లు షేర్ చేసుకున్నాడు అజయ్ భూపతి. మంగళవారం సీక్వెల్‌కు రంగం సిద్ధం చేసినట్లు తెలిపాడు. వీలైనంత త్వరలోనే మూవీని పట్టాలెక్కించనున్నారట.

అయితే ఈ సినిమా ‘మంగళవారం’ సినిమాకి సీక్వెల్ కాదట ప్రీక్వెల్ అని తెలుస్తోంది. అయితే ఈ మూవీలో పాయల్ రాజ్‌పుత్ స్థానంలో మరో కొత్త హీరోయిన్ నటించొచ్చని టాక్ నడుస్తోంది. ఈ సినిమా బజ్‌ని దృష్టిలో పెట్టుకొని ఓ బాలీవుడ్(Bollywood) నిర్మాణ సంస్థ కూడా మేకింగ్‌లో భాగస్వామ్యం అయినట్లు సమాచారం. దీంతో వీలైనంత త్వరలోనే అభిమానులకు మరో సస్పెన్స్ థ్రిల్లర్ చూసే అవకాశం దక్కనుంది.

Related Posts

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *